యూత్ స్టార్ నితిన్ -షాలినీల వివాహం ఈనెల 26న హైదరాబాద్ లో నిరాడంబరంగా జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెళ్లి కార్యక్రమం సింపుల్ గా పెద్దగా హడావుడి లేకుండా కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ పెళ్లి తంతు ముగించనున్నారు. పెళ్లి ముహూర్తం కూడా దగ్గర్లోనే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లికి ఇంకా ఆరు రోజులే సమయం ఉండటంతో పనులు మొదలు పెట్టేసారు. పెళ్లి కార్డుల పంపిణీ పనులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో నితిన్ తన పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ కు పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేసారు.
పెళ్లికి హాజరై నవ దంపతుల్ని ఆశీర్వదించాలని కేసీఆర్ ని నితిన్ కోరాడు. అనంతరం కాసేపు నితిన్ తో కేసీఆర్ ముచ్చటించారు. తన సినిమా కెరీర్ గురించి కేసీఆర్ ఆడిగినట్లు సమాచారం. తెలంగాణలో సినిమా ఇండస్ర్టీని మరింతగా అభివృద్ది చేయాలన్న అంశం గురించి కేసీఆర్ నితిని తో అన్నట్లు తెలిసింది. ఇక నితిన్ పెళ్లిని అంగరంగ వైభంగా చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇంతలో కరోనా వచ్చి పడింది. ఈ నేపథ్యం కరోనా తగ్గిపోయిన తర్వాత చేసుకోవాలని రెండు నెలలు వెయిట్ చేసాడు. కానీ మహమ్మారి ఎంతకు అదుపులోకి రాకపోవడం…వ్యాక్సిన్ కూడా రాకపోవడంతో నితిన్ నిర్ణయం మార్చుకున్నాడు. కరోనాతో పెట్టుకుంటే? ఈ ఏడాది పెళ్లి కష్టం అని భావించి జులై 26వ తేదికి ఫిక్స్ అయ్యాడు.
ఈ పెళ్లికి కేవలం పెళ్లి కొడుకు- పెళ్లి కూతురు తల్లిదండ్రులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. మరి సీఎం కేసీఆర్ హాజరవుతారా? ఆ రోజు ఆయన బిజీ షెడ్యూల్ ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నితిన్ చేతిలో కొన్ని సినిమాలున్నాయి. ఒక సినిమా సెట్స్ లో ఉంది. కరోనా కారణంగా షూటింగ్ లు బంద్ అవ్వడంతో అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. తాజా పరిస్థితి చూస్తుంటే కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకూ స్టార్ హీరోలెవరు షూటింగ్ లు చేసేలా కనిపించలేదు. థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు.