Sindhuri Movie: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సింధూరి చిత్రం !!!

Sindhuri Movie: ఈరోజు సింధూరీ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, ఈశ్వర్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా కిషోర్ బాబు నిర్మాతగా లీలారెడ్ది, రావు నిర్మాణంలో తెరకేక్కుతున్న ఈ సినిమాను కెకె దర్శకత్వం వాహిస్తున్నారు, నరాల నాగేశ్వరరావు రచనా సహకారం అందిస్తున్న ఈ సినిమాకు జయబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈరోజు నుండి 90 రోజులు నాన్ స్టాప్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకోనుంది.

ఇది ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథ. అబ్బాయి గోవిందు, అమ్మాయి పేరు సింధూరి. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కారణంగా ఆ అబ్బాయికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నదే ఈ కధ.

తననే ప్రాణంగా ప్రేమించిన ఆ అబ్బాయికి తనలాగే వున్న మరో అమ్మాయిని చూపి పెళ్ళి చెయ్యాలి అనుకునే ఒక అమ్మాయి కథ. వీళ్ళిద్దరూ అనుకున్నది జరిగిందా లేదా? చివరికి ఏమయింది అన్నదే ఈ కధ.

Pithapuram Public Reaction On Pawan Kalyan Ruling || Ap Public Talk || Chandrababu || Ys Jagan || TR