Nari Nari Naduma Murari Trailer: చార్మింగ్ స్టార్ శర్వా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారితో అలరించబోతున్నారు. జనవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. సామజవరగమన ఫేమ్ కామెడీ మాస్ట్రో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, మొదటి రెండు పాటల ద్వారా భారీ అంచనాలను పెంచింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
ట్రైలర్ లో గౌతమ్(శర్వా) బి-టెక్ ఆర్కిటెక్ట్, తన గర్ల్ ఫ్రెండ్ (సాక్షి వైద్య)తో సాఫీగా సాగుతున్న అతడి జీవితం, ఒక్కసారిగా అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ (సంయుక్త) తిరిగి జీవితంలోకి రావడంతో గందరగోళంగా మారుతుంది. అక్కడి నుంచి మొదలయ్యే హిలేరియస్ పరిస్థితులు, గౌతమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ మధ్య నలిగిపోవడం ప్రేక్షకులకి నవ్వులు పంచాయి.
శర్వానంద్ రెండు డిఫరెంట్ టైమ్‌లైన్లలో, రెండు ప్రేమకథల్లో రెండు స్టైలిష్ లుక్స్‌లో కనిపించి తన కామిక్ టైమింగ్, డైనమిక్ షేడ్స్‌తో అదరగొట్టారు. సాక్షి వైద్య తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటే, సంయుక్త కథకు మరింత స్పైస్ యాడ్ చేసింది. శర్వానంద్ తండ్రిగా నరేష్ మరోసారి తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు సత్య, సునీల్, సుదర్శన్, సంపత్ రాజ్ ల కామెడీ నవ్వుల వర్షం కురిపిస్తుంది.
దర్శకుడు రామ్ అబ్బరాజు క్లిన్ అండ్ ఎంగేజింగ్ కామెడీని అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. సినిమాటోగ్రాఫర్లు జ్ఞాన శేఖర్ వీఎస్, యువరాజ్ విజువల్స్ అందంగా వున్నాయి, విశాల్ చంద్రశేఖర్ సంగీతం కథకు ఎనర్జీ నింపుతుంది.

AK ఎంటర్‌టైన్‌మెంట్స్ , అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ విలువలు సినిమాకు మరో బలంగా నిలిచాయి. భాను బొగవరపు కథ, నందు సవిరిగాన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ బ్రహ్మ కడలి, సహ నిర్మాత అజయ్ సుంకర.`
ఆకట్టుకునే కథనం, నవ్వులతో నిండిన స్క్రీన్‌ప్లేతో ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. సంక్రాంతికి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ట్రిపుల్ మ్యాడ్‌నెస్‌తో వచ్చే ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి పండుగ ట్రీట్ ఇవ్వనుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, శ్రీ విష్ణు (స్పెషల్ ఎప్పిరియన్స్), సంయుక్త, సాక్షి వైద్య, నరేష్, సంపత్ రాజ్, సత్య, సునీల్,
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
కథ: భాను బోగవరపు
డైలాగ్స్: నందు సవిరిగాన
DOP: జ్ఞాన శేఖర్ VS, యువరాజ్
సంగీతం: విశాల్ చంద్ర శేఖర్
సహ నిర్మాత: అజయ్ సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
PRO: వంశీ-శేఖర్

