Heroine Samyuktha Interview: ‘నారి నారి నడుమ మురారి’ అందరూ ఎంజాయ్ చేసే ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: హీరోయిన్ సంయుక్త

Heroine Samyuktha Interview: చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సంక్రాంతికి రావడం ఎలా అనిపిస్తుంది ?

సంక్రాంతికి రావడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది. ఇది చాలా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. పండుగకి పర్ఫెక్ట్ మూవీ.

-డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. నాకు కామెడీ సినిమా చేయడం చాలా ఇష్టం. షూటింగ్ కూడా చాలా ఫన్ గా ఉంటుంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

-ఇందులో నా క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ సహజంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు. కానీ ఇది అలా కాదు. డైరెక్టర్ గారు చాలా యూనిక్ పాయింట్ తో ఈ కథ రాశారు. అది మీరు స్క్రీన్ మీద చూడాలి.

-డైరెక్టర్ గారు నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇందులో చాలా మంచి సిచువేషన్ కామెడీ ఉంటుంది. ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పాను. చాలా ఎంజాయ్ చేశాను.

-ఈ సినిమా సైన్ చేసినప్పుడు ఎంత ఎక్సైట్ మెంట్ వుందో, పూర్తయిన తర్వాత కూడా అదే ఎక్సైట్మెంట్ కలిగింది. డబ్బింగ్ లో సినిమా చూసా. చాలా అద్భుతంగా ఉంది.

శర్వా గారితో నటించడం ఎలా అనిపించింది ?

-శర్వానంద్ గారు చాలా అద్భుతమైన టైమింగ్ ఉన్న హీరో. చాలా సపోర్టివ్, హెల్ప్ ఫుల్ గా ఉంటారు. ఆయనతో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్.

-ఇందులో నరేష్ గారు, సత్య గారి పాత్రలు కూడా అందరినీ అలరిస్తాయి.

డైరెక్టర్ రామ్ అబ్బరాజు గురించి?

-డైరెక్టర్ చాలా కూల్ గా ఉంటారు. ఇంత కాంపిటీషన్లో సినిమా వస్తున్న ఆయనకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఆయన కోపంలో ఉన్నట్లు ఎప్పుడు చూడలేదు. చాలా క్లారిటీ వున్న డైరెక్టర్.

అనిల్ గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది?

-అనిల్ గారికి సినిమా అంటే చాలా పాషన్. సినిమాకి ఆయనే మెయిన్ పిల్లర్. అందర్నీ సపోర్ట్ చేస్తారు. ఆయన కోసం చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

సాక్షి వైద్య గురించి?

-మా మధ్య మంచి కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. తనంటే నాకు చాలా గౌరవం. తను ప్రతి సీన్ కి ప్రిపేర్ అయ్యే విధానం చాలా బాగుంటుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది

మీరు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటారు?

-ఇప్పుడు వరకు వైవిధ్యమైన పాత్రలు చేశాను. నా ప్రతి సినిమాకి వైవిధ్యం ఉంటుంది. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. బయోపిక్స్ చేయాలని కూడా ఉంది. అలాగే కామెడీ క్యారెక్టర్స్ కూడా చేయాలనే ఉంది.

2025 లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా?

-పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేశాను. అది ఫెంటాస్టిక్ ఫిలిం. ఎంత చెప్పినా తక్కువే. యాక్టింగ్ షూటింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను.

మీరు ఉంటే సినిమా హిట్ అనే బ్రాండ్ వస్తుంది?

-మనం ఆడియన్స్ కోసం సినిమా చేస్తాము. కంటెంట్ ఉంటే ఆడియన్స్ కచ్చితంగా చూస్తారు.

సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు

-ఎక్కడున్నా అక్కడ ప్రతి పండుగ జరుపుకోవడం అనేది నాకు అలవాటు. అందరూ కూడా మంచి పిండి వంటకాలు మా ఇంటికి పంపిస్తారని కోరుకుంటున్నాను (నవ్వుతూ).

బ్లాక్ గోల్డ్ ఎప్పుడు వస్తుంది?,

-ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తి కావచ్చు. సినిమా చాలా బాగా వస్తోంది

Raja Saab Review || Raja Saab Collection || Prabhas || Maruthi || Telugu Rajyam