(సికిందర్)
దర్శకత్వం : హరినాథ్
తారాగణం : ఆది పినిశెట్టి, తాప్సీ, రీతికా సింగ్, వెన్నెల కిషోర్, సప్తగిరి, తులసి, శివాజీరాజా, ఆదర్శ్, శ్రీకాంత్ అయ్యర్, సత్యకృష్ణన్‌తదితరులు :
కథ : ఆదే కనగళ్ తమిళ రీమేక్, రచన : కోన వెంకట్ సంగీతం: అచ్చు రాజమణి, ప్రసన్, ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్
బ్యానర్ : ఎం.వి.వి సినిమా, కోన ఫిలిమ్ కార్పొరేషన్
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
విడుదల: ఆగస్టు 24, 2018
2.5 / 5
***
తెలుగు. తమిళ సినిమాల్లో హీరో, యాంటీ హీరో పాత్రలు, సహాయ పాత్రలూ వేస్తున్న ఆది పినిశెట్టి ఈసారి తెలుగులోకి తమిళ రీమేక్ ని తీసుకుని థ్రిల్లర్ లోనటించాడు. ఐతే ‘మలుపు’ అనే తమిళ డబ్బింగ్ లో థిల్లర్ పాత్రలో తనని ఆల్రెడీ చూసిన తెలుగు ప్రేక్షకులకి ఈసారి ఇంకెలాటి వెరైటీ ని అందించాడు? ‘నీవెవరు’ అనే టైటిల్ కమర్షియల్ గా, బలంగా లేకపోయినా, విషయపరంగా బలమైన సస్పెన్స్ థ్రిల్లర్ తోనే వచ్చాడా, లేదా ఈ కింద చూద్దాం…
కథ
అంధుడైన కళ్యాణ్ (ఆది పినిశెట్టి) తానే షెఫ్ గా ఒక రెస్టారెంట్ నడుపుతూంటాడు. తల్లి దండ్రులు (తులసి, శివాజీరాజా) పెళ్లి చేయాలనుకుంటారు. పదేళ్లుగా కుటుంబానికి తెలిసిన అనూ ( రీతికా సింగ్) కిద్దామనుకుంటారు. అనూ తల్లిదండ్రుల(శ్రీకాంత్ అయ్యర్, శ్రీవాణి) కి అభ్యంతరముండదు. అనూ అతన్నే ప్రేమిస్తోంది. కానీ అనూ ప్రేమని కళ్యాణ్ ఫీల్ కాడు. ఇంతలో రెస్టారెంట్ కి వచ్చిన వెన్నెల (తాప్సీ) తో పరిచయం పెరిగి ప్రేమగా మార్చుకుంటాడు కళ్యాణ్. ఒక రోజు యాక్సిడెంట్ కి గురైతే కళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు చూస్తే వెన్నెల వుండదు. ఏమైంది? అసలెవరామె? ఎక్కడ్నించి వచ్చింది? ఎక్కడి కెళ్ళి పోయింది?…ఆమెఅన్వేషణలో పడతాడు కళ్యాణ్. అప్పుడామె గురించి ఒక ఊహించని నిజం తెలుస్తునది. ఏమిటా నిజం?…ఇదీ కథ.
ఎలావుంది కథ
ఇది తమిళంలో గత సంవత్సరం హిట్టయిన ‘అధే కన్గళ్’ (అవేకళ్ళు) అనే థ్రిల్లర్ రీమేక్. దీనికి రచన, దర్శకత్వం రోహిన్ వెంకటేశన్. అంధుడైన హీరో షెఫ్ పాత్రకి, నిజ జీవితంలో మాస్టర్ షెఫ్ పోటీల్లో నెగ్గిన అంధురాలైన షెఫ్, క్రిస్టీన్ హా నుంచి స్ఫూర్తి పొందారు. గత సంవత్సరం కన్నడలో రీమేక్ చేస్తే అది కూడా హిట్టయింది. మూస కృత్రిమ కథల్ని పక్కన బెడితే, ఆధునిక సమాజంలో నేరాల తీరుతెన్నులు మారిపోయాయి. కథకుడు చూసిన మూస సినిమాల ప్రభావంతో వూహించుకున్నవే నేరాలు కాదు. దీనికి దూరంగా వుంటున్న తమిళంలో కొత్త దర్శకులు, సమాజంలో వాస్తవంగా జరుగుతున్న నేరాల్ని కథా వస్తువులుగా చేసుకుని, ప్రజానీకాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ అయిన చైన్ స్నాచింగ్ తో ‘మెట్రో’, డేటా చోరీతో ‘అభిమన్యుడు’ కొన్ని ఉదాహరణలు. వీటికి సామాజిక ప్రయోజనం తప్పకుండా వుంది. వెర్రి వేషాల ప్రేమ సినిమాలతో ఏ ప్రయోజనమూ లేదు. నేరాల్ని, నేరస్తుల్ని మగవాళ్ళకే పరిమితం చేసి ప్రేక్షకులతో సేఫ్ గేమ్ ఆడుకునే చాదస్తం కూడా ఎక్కువ వుంది. ప్రపంచంలో వున్నది వున్నట్టు చూపించడానికి కొత్త దర్శకులు చాలా ఈజ్ తో ముందుకొస్తున్నారు. తెలుగులో ఇటీవలే హిట్టయిన ‘ఆరెక్స్ -100’ ఇలాటిది. ఇప్పడు ‘నీవెవరో’ కూడా ఇలాటిదే. సినిమా నేర ప్రపంచాల్ని మగవాళ్ల మూస నుంచి విడగొట్టి, ఆడవాళ్ళకి కట్టబెడుతూ వచ్చిన ఈ రెండు యాంటీ హీరోయిన్ కథలూ ఒక వాస్తవిక జగత్తులో సాకులు వెతకడానికి వీల్లేని ఒక నిజం. ఇందుకే నిజాల్ని నిజంగా చూపిస్తున్న ‘నీవెవరో’ న్యూవేవ్ కథ, నిర్వహణ సంగతెలా వున్న కాన్సెప్ట్ వరకూ బలమైనదే.
ఎవరెలా చేశారు
మొదటి మార్కులు యాంటీ హీరోయిన్ గా నటించిన తాప్సీకి పడతాయి. చివరి అరగంట ఆమె వూపెయ్యక పోతే, వూపెయ్యడానికి హీరో పాత్రకి ఏమీ మిగిలేది కాదు. అయితే తమిళ, కన్నడ వెర్షన్స్ లో ఈ పాత్ర పోషించింది చిన్న హీరోయిన్లు. తెలుగులో ఆలిండియా పాపులర్ హీరోయిన్, ‘పింక్’ తో బలంగా ఎస్టాబ్లిష్ అయిన తాప్సీ పోషించడంతో పాత్ర మరపురానిదై పోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి, లేదా సినిమాల్లో బలమైన హీరోయిన్ పాత్ర వున్నప్పుడు, పేరున్న హీరోయిన్నే తీసుకుంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం వేరు. చిన్నా చితకా హీరోయిన్లతో ఆ పాత్రల ప్రాధాన్యం పోతుంది. ఈ థ్రిల్లర్ నిర్మాత, దర్శకుడు, రచయితా (కోన వెంకట్) మంచి కమర్షియల్ నిర్ణయమే తీసుకున్నారు. ఫస్టాఫ్ లో అమాయకంగా ఒక వైపే చూపించే తాప్సీ, ఆ తర్వాత రెండో వైపు చూపిస్తే, ఆ చివరి అరగంటా ఆమె వైపే చూడాల్సి వస్తోంది ప్రేక్షకులకి. సీను తర్వాత సీను ఆమె దుమ్ము రేపేదే మొత్తం.
మొదటి అరగంట అంధుడి పాత్రలో ఆది పినిశెట్టి సౌమ్యంగా కన్పిస్తూంటే మాస్ కోసం ఫైట్లు చేయడం వుంది. అయితే రోమాన్స్ లో సెకెండ్ హీరోయిన్ తో, తాప్సీతో ఇద్దరితో పొడిపొడిగా వుండడమే ఇబ్బంది. దీంతో పాత్రకి తగిన భావోద్వేగాలులేక, కన్పించకుండా పోయిన తాప్సీని వెతుక్కునే క్రమం డల్ గ మారింది. మొదటి అరగంట తర్వాత నున్చీ, సెకండాఫ్ లో అరగంతవరకూ సుదీర్ఘంగా తాప్సీని వెతుక్కునే సీన్లే రావడంతో ఈ పార్టు అంతా బలహీనంగా మారింది. చివరికి తాప్సీని పట్టుకున్నాక ఆమె అంతు చూసే క్రమం సహజంగానే హీరోగా తనకి తప్పాడు. యాక్షన్ సీన్లు బాగా చేశాడు. కానీ తాప్సీ పాత్ర ముగిశాక, ఆమె ఎందుకిలా చేసిందో పాక్షికంగానే అర్ధం జేసుకున్నాడు. ఆమె ఎందుకలా చేసిందో ప్రేక్షకులకి మాత్రమే తెలియ జేశాడు దర్శకుడు. హీరోపాత్ర అసమగ్రంగా వుండి పోయింది. ఆమె వూరుకోకుండా ఇంకేం చేయబోతోందో ఆమె ద్వారా ప్రేక్షకులకి మాత్రమే హింట్ ఇస్తూ ముగించారు. కానీ హీరోకి కూడా తెలిస్తేనే కదా, పోటా పోటీ పాత్రలతో కథకి ఫినిషింగ్ టచ్ – లేదా మాస్టర్ స్ట్రోక్ బావుంటుంది.
హీరో వెంట వుండే వెన్నెల కిషోర్ కానిస్టేబుల్ పాత్ర కామెడీకి పనికొచ్చింది. పాటలకి ప్రాధాన్యం లేదు. కెమెరా వర్క్ బావుంది. ప్రొడక్షన్ విలువలు ఖరీదైనవిగా వున్నాయి. దర్శకుడి అసలు ప్రతిభ ఇది రీమేక్ కాబట్టి తెలిసే వీలు లేదు. తాప్సీ టెర్రిఫిక్ నటన కోసం