షాకింగ్ పిక్ : మహేష్ ని మొదటిసారి ఇలా చూపించి షాకిచ్చిన నమ్రత..!

సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ సినిమా వరకు కూడా ఉన్న ఆల్ మోస్ట్ హీరోస్ లో తమ బేర్ లుక్ అంటే షర్ట్ లేకుండా తమ బాడీ ని చూపించిన సందర్భాలు సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు తన బాడీ వరకు కాదు కదా తన ఛాతీ వరకు కూడా ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.

ఫైనల్ గా అయితే మహేష్ నుంచి 1(నేనొక్కడినే) అనే సినిమాతో మాత్రం షాక్ ఇచ్చాడు. ఫస్ట్ టైం కొన్ని షర్ట్ లెస్ ఫోటోలు తన బ్యాక్ విజువల్స్ జిమ్ బాడీ ని చూపించాడు. కానీ సిక్స్ ప్యాక్ మాత్రం చూపించలేదు. కానీ ఫస్ట్ టైం మాత్రం ఓ షాక్ ఇప్పుడు వచ్చిందని చెప్పాలి.

మహేష్ నుంచి మొదటి సారి ఎవరూ చూడని లుక్ ని తన భార్య నమ్రత ఘట్టమనేని షేర్ చేసి నిజంగా ఫ్యాన్స్ సహా అందరికీ షాకిచ్చారు. మరి ఇందులో అయితే మహేష్ తమ స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా సగం బాడీ చూపిస్తున్నాడు. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో చూడాలి అనుకుంటున్నా లుక్ ఫైనల్ గా నమ్రత వల్ల రివీల్ అయ్యింది.

మరి మహేష్ ని ఈ లుక్ లో అయితే నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ఈ పిక్స్ షేర్ చేసుకున్నారు. ఇక ఈ గ్యాప్ తర్వాత అయితే మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన కెరీర్ లో 28వ సినిమాని చేయనున్నాడు.