Mahesh Babu: జక్కన్న సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్… ఏం జరిగిందంటే?

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నుంచి రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. రాజమౌళితో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా మహేష్ బాబు సినిమా రాబోతుంది .ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అలాగే వర్క్ షాప్ లో పాల్గొంటూ మహేష్ బాబు బిజీగా గడిపారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు మొదటి అడుగు పడిందని తెలుస్తుంది జనవరి రెండో తేదీ ఈ సినిమా పూజ కార్యక్రమాలను హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగాయని తెలుస్తుంది. ఇక ఈ పూజ కార్యక్రమాలలో చిత్ర బృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొన్నట్లు మహేష్ బాబు తన 17 సంవత్సరాల సెంటిమెంటును బ్రేక్ చేశారని తెలుస్తుంది.

సాధారణంగా మహేష్ బాబు ఏదైనా కొత్త సినిమా ప్రారంభిస్తుంటే ఆ సినిమా పూజ కార్యక్రమాలకు హాజరు కారు ఆయనకు బదులుగా తన భార్య నమ్రత ఆ పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. గత 17 సంవత్సరాలుగా ఈయన సినిమా పూజ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కానీ మొదటిసారి రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలకు మహేష్ బాబు వచ్చారని తెలుస్తోంది. ఈయనతో పాటు మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఈ సినిమా పూజ కార్యక్రమాలలో సందడి చేసినట్టు తెలుస్తుంది.

నిజానికి ఈ సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొనడం కూడా మహేష్ బాబు ఇష్టం లేదు. కానీ రాజమౌళి ఒత్తిడి చేయడంతోనే మహేష్ బాబు ఈ సినిమా పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక నేడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి ఇక త్వరలోనే విజయవాడలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో షూటింగ్ పనులు జరుగుతాయని తెలుస్తుంది.