Mahesh Babu: గౌతమ్ పుట్టిన తర్వాత మహేష్ నమ్రత విడిపోయారా…. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నమ్రత!

Mahesh Babu: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన భార్య నమ్రత కూడా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అని చెప్పాలి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన నమ్రత మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించారు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

ఇక పెళ్లి తర్వాత ఎంతోమంది భార్య భర్తలు గొడవల వల్ల విడిపోయిన వారు ఉన్నారు ముఖ్యంగా ఇండస్ట్రీలో ఇలాంటి జంటలు ఎక్కువగా ఉన్నాయి అందరిలాగే మహేష్ నమ్రత మధ్య భేదాభిప్రాయాలు రావడంతో గౌతం పుట్టిన తర్వాత ఇద్దరు విడిపోయారని ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నమ్రత తెలిపారు. ఇలా మా మధ్య గొడవ రావడంతో నేను గౌతమ్ ని తీసుకుని ముంబైకి వెళ్లిపోయాను. ఇలా కొద్దిరోజుల పాటు దూరంగా ఉన్నానని నమ్రత తెలిపారు.

ఇలా మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ దూరం మా బంధాన్ని మరింత బలపరిచిందని తరువాత తప్పు తెలుసుకొని ఇద్దరం ఒకటయ్యామని తెలిపారు. ఇక పెళ్లికి ముందే మహేష్ నేను ఇండస్ట్రీలో కొనసాగకూడదని తెలిపారు ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు నేను ఏ జాబ్ చేస్తున్నా కూడా అతను వద్దని చెప్పేవారని నమ్రత వెల్లడించారు. ఇలా పెళ్లికి ముందే మహేష్ నేను జాబ్ చేయకూడదని చెప్పడంతో నేను ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్నా పెద్దగా బాధ అనిపించలేదని తెలిపారు.

ఇప్పటికీ మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చిన మీరు నటిస్తారా అనే ప్రశ్న ఎదురు కావడంతో మహేష్ సినిమాలో అవకాశమొచ్చిన తాను నటించనని కెమెరా ముందుకు రాకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి సినిమాలలో నటించను అంటూ నమ్రత తేల్చి చెప్పారు. ఈమె సినిమాలకు దూరంగా ఉన్న మహేష్ బాబు సినిమా వ్యవహారాలతో పాటు కుటుంబ బాధ్యతలు అలాగే వ్యాపారాలను కూడా చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.