Mahesh Babu: వామ్మో మహేశ్ ప్రతిరోజూ అలాంటి టాబ్లెట్స్ వాడుతారా….నమ్రతనే టాబ్లెట్స్ ఇస్తుందా?

Mahesh Babu: సాధారణంగా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అది సెలబ్రిటీలు అయినా లేదా సాధారణ వ్యక్తులైన సరే కొన్ని రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏ ఒక్కరు కూడా ముందుగా టాబ్లెట్స్ ఉపయోగించారు వాటిని సహజ పద్ధతిలో నయం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది సాధ్యం కాని పక్షంలో మందులు వాడటం అనేది జరుగుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే మన సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇప్పటికే చికిత్స తీసుకుంటూ మందులు వాడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు కూడా ఓ సమస్యతో బాధపడుతున్నారట ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఈయన మొదట్లో నాచురల్ రెమిడీస్ ఉపయోగించిన ఫలితం లేకుండా పోయిందని అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాల్సిందేనని తెలుస్తోంది.

ఇలా ప్రతిరోజు మందులు వాడే అంతగా మహేష్ బాబు బాధపడుతున్న సమస్య ఏంటి అనే విషయానికి వస్తే… ఆయన సైనస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారని తెలుస్తుంది. చలికాలం వస్తే చాలు చలి తీవ్రత కారణంగా మహేష్ బాబు బ్రీతింగ్ ప్రాబ్లం ఎదుర్కొంటారట అందుకోసమే ప్రతిరోజు టాబ్లెట్స్ వాడుతారని నమ్రత ఎంతో బాధ్యతగా నిత్యం ఈయనకు టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారని తెలుస్తుంది.

మహేష్ బాబు చాలా సెన్సిటివ్ అనే విషయం మనకు తెలిసిందే. ఈయనకు అధిక చలి తీవ్రత ఉన్నా లేదా అధిక వేడి ఉన్నప్పటికీ కూడా తన శరీరంలో వెంటనే మార్పులు వస్తాయని అందుకే ఈయన తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా పనులలో బిజీ కానున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.