Namrata: ఒంటరైన నమ్రత…. ఎంత పని చేశావు జక్కన్న… తెగ ఫీల్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్?

Namrata: సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ ఎంతోమందికి ఆదర్శంగా ఉంటారని చెప్పాలి. ఇక పెళ్లి సమయం నుంచి వీరిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో అన్యోన్య దంపతులుగా గుర్తింపు పొందారు. ఇక మహేష్ బాబు ఎక్కడికి వెళ్లినా వెంట తన భార్య నమ్రతను కూడా తీసుకు వెళుతూ ఉంటారు. ఒక వెకేషన్ కి వెళ్ళిన లేదా ఒక ఫంక్షన్ కి వెళ్లినా వీరిద్దరూ జంటగా వెళుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో నమ్రత మాత్రం ఒంటరిగా ఉంటుందని చెప్పాలి ఎక్కడికి వెళ్లినా ఈమె తన భర్త తోడు లేకుండా ఒంటరిగానే అన్నిచోట్లకు వెళ్తున్నారు తాజాగా సినీ సెలబ్రిటీలందరూ కూడా ఇటీవల దుబాయ్ లోని ఒక పెళ్లి వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే అయితే అందులో రాంచరణ్ దంపతులతో పాటు ఎన్టీఆర్ దంపతులు అందరూ కూడా హాజరయ్యారు కానీ నమ్రత మాత్రం సింగిల్గానే హాజరయ్యారు.

ఫోటోలు చూసినా అభిమానులు మహేష్ నమ్రత జంటను విడదీశారనీ తెగ ఫీలవుతున్నారు అయితే మహేష్ నమ్రతను విడదీసింది మరెవరో కాదు డైరెక్టర్ రాజమౌళి అని చెప్పాలి ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లు మహేష్ బాబు నటించిన సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది ఈ సినిమా షూటింగ్ కోసం మహేష్ బాబును పక్కనకి కూడా రాజమౌళి కదలనివ్వడం లేదు దీంతో ఎక్కడికి వెళ్లినా నమ్రత మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా మహేష్ పక్కన లేకుండా నమ్రతను చూడటంతో దీనంతటికీ జక్కన్న కారణమంటూ మహేష్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.