వైరల్ ఫొటో: ‘RRR’సెట్ నుంచి లీకైంది

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందిస్తున్న తాజా చిత్రం మొన్న సోమవారం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఆర్.ఆర్.ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాచుర్యం పొందిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం #RRR కోసం భారీ సెట్ల నిర్మాణం జరుగుతోందన్న విషయం తెలిసిందే కదా. అందులో ఒక సెట్ ఫోటో లీక్ అయ్యి బయటకు వచ్చింది.

ఇక్కడ మీరు ఫొటోలో చూస్తున్న సెట్ నిర్మాణం ప్రస్తుతం సీబీఐటీ కాలేజీకి సమీపంలో జరుగుతోందట. ఈ సెట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మూడు నెలల పాటు షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ సెట్ పద్దతి,విధానం చూస్తుంటే బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ అనే అనిపిస్తోంది. ఈ చిత్రం కథ స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి . ఈ సెట్ డిజైన్ చూస్తూంటే ఆ వార్తలు నిజమే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సెట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 19 నుండి ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ లపై ఒక భారీ యాక్షన్ బ్లాక్ ను రాజమౌళి చిత్రీకరిస్తున్నాడు. ‘బాహుబలి’ చిత్రం తో దేశ వ్యాప్తంగా గుర్తింపు ను తెచ్చుకున్న అగ్ర దర్శకుడు రాజమౌళి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తూండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ… ప్రతి ఒక్కరూ అమితాసక్తితో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మా బ్యానర్‌లో తెరకెక్కించడం అదృష్టంగా భావిస్తున్నాను.నందమూరి, మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి అంచనాలను మించేలా నిర్మాణంలో ఎక్కడా రాజీపడబోము.

సుమారు 200కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.