ఇన్సైడ్ టాక్ : “NTR30” పై తారక్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కొరటాల..?

బిగ్గెస్ట్ మాస్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ క్రేజ్ ని సొంతం చేసుకోగా రీసెంట్ గానే దేశ కేంద్ర మంత్రి అమిత్ షా తో కలవడం రాజకీయ పరంగా కూడా కలకలం రేపింది. ఇక ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొత్త సినిమా పంచాయితీ మాత్రం ఇంకా ఎక్కడా తేల లేదు.

దర్శకుడు కొరటాల శివ అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పి ఆల్రెడీ మోషన్ పోస్టర్ టీజర్ కూడా రిలీజ్ చేసేసారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడే కొరటాల ఎన్టీఆర్ కి తన ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకీ ఆ మేటర్ ఏమిటంటే ఈ సినిమాకి కొరటాల ముందు కథ అంతా మార్చేసాడట. ఇప్పుడు కొత్త కథతో ఎన్టీఆర్ 30 వ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అంటే గతంలో చూపించిన మోషన్ పోస్టర్ లో కథ ఇక కనిపించనట్టే అని చెప్పాలి.

అలాగే కొత్త కథను కూడా ఎన్టీఆర్ అయితే ఓకే చేసినట్టే సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఒక కథను మొత్తం మార్చి మళ్ళీ ఓ కొత్త సినిమాగా ప్లాన్ చెయ్యడం అనేది షాకింగ్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాకి ఏమవుతుందో ఏంటో?