RRR 2: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ రావటమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు మరో గౌరవం లభించిందని చెప్పాలి.
ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్, ప్రీమియర్ ప్రదర్శన జరుగుతోంది.ప్రపంచ వేదికలపై ఆర్ఆర్ఆర్ చిత్రానికి దక్కిన మరో గౌరవం ఇది. ఈ సందర్భంగా రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ కుటుంబాలతో కలిసి లండన్ లో సందడి చేస్తున్నారు. ఇలా ఇద్దరి హీరోలను ఒకే వేదికపై చూడటంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ ప్రీమియర్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కలిస్తే అల్లరి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తాజాగా ఇద్దరు కలిసి డైరెక్టర్ రాజమౌళిని అదే స్థాయిలో అల్లరి పట్టిస్తూ ఉన్నారు. ఇక ఎందుకు సంబంధించిన వీడియోని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఎప్పటిలాగే రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళిని ఆటపట్టిస్తూ కనిపించారు. వాళ్ళిద్దరి అల్లరిని రాజమౌళి భరించలేకపోతుండడం సరదాగా అనిపిస్తుంది.
ఇదే సమయంలోనే ఉపాసన రాజమౌళిని ప్రశ్నిస్తూ రాజమౌళి గారు మీరు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ 2 చేస్తారా అని ప్రశ్నించింది. దీనికి రాజమౌళి ఎస్ అని సమాధానం ఇచ్చారు. వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యూ అంటూ చెప్పుకు వచ్చారు. అయితే ఆర్ఆర్ఆర్ 2 సినిమా గురించి రాజమౌళి ఎస్ అని చెప్పడంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా సీక్వెల్ గురించి సీరియస్ గా చెప్పారా లేకపోతే సరదాగా అలా మాట్లాడారో తెలియదు కానీ ఈ వార్త మాత్రం అభిమానులను సందడి చేస్తోంది.