Jr NTR : లండన్‌లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ ఓ గ్రాండ్ సెలబ్రేషన్ గా మారింది. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు పండుగలా అనిపించింది. స్టేజ్ పై చరణ్ తారక్‌ను ఆత్మీయంగా హత్తుకోవడం హైలైట్‌గా నిలిచింది. చాలా కాలం తరువాత ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
అయితే ఈ హంగామాలో ఓ చిన్న సంఘటన మాత్రం అభిమానుల మానసిక స్థాయిని ప్రశ్నించింది. ఈవెంట్ అనంతరం బయట ఎన్టీఆర్ దగ్గరకు సెల్ఫీ కోసం జనం ఎగబడ్డారు. తారక్ వారు శాంతంగా “వెయిట్ చేయండి, సెల్ఫీలు ఇస్తా” అని చెప్పినా, వారు వినిపించుకోలేదు. చివరికి భద్రతా సిబ్బంది ఎన్టీఆర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరచలేదని, వారిని కలవాలనే కోరికతోనే బహిరంగంగా స్పందించారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అభిమానుల ఆవేశం కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు అసౌకర్యంగా మారుతోందని ఈ ఘటన తెలియజేసింది. అభిమానంతో పాటు, బాధ్యతా నైపుణ్యాన్ని కూడా చూపిస్తేనే అది నిజమైన అభిమానమవుతుందని మరికొందరు చెబుతున్నారు.