వైరల్ : “భారతీయుడు 2” కోసం కమల్ హాసన్ క్రేజీ డెసిషన్.!

నటన కోసం ప్రాణం పెట్టె ఇండియన్ స్టార్ హీరోస్ లో ఉలగనయగన్ కమల్ హాసన్ కూడా ఒకరు. అయితే కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ రీసెంట్ ప్రాజెక్ట్ “విక్రమ్” తమిళ నాట బాక్సాఫీస్ దగ్గర సెన్సషనల్ హిట్ గా నిలిచింది.

మరి ఈ సినిమా అనంతరం మళ్ళీ తన భారీ చిత్రం ఇండియన్ 2 తెలుగులో “భారతీయుడు 2” చిత్రం చేస్తున్నారు. అంతకు ముందే ఈ చిత్రం దర్శకుడు శంకర్ తో భారీ బడ్జెట్ తో ప్లాన్ చెయ్యగా మధ్యలో నిర్మాతలకు శంకర్ కి సినిమా విషయంలో కొన్ని విషయాలకు గాను పడకపోవడంతో మధ్యలో బయటకి వచ్చేసారు.

ఇక మళ్ళీ మధ్యలో కమల్ హాసన్ కలుగజేసుకొని నార్మల్ గా మేటర్ సెటిల్ చేసి సినిమాలోకి శంకర్ ని మళ్ళీ తీసుకు వచ్చారు. ఇక ఇపుడు మళ్ళీ షూటింగ్ రీస్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ లో కమల్ హాసన్ మొదలు కానుండగా ఈ సినిమా కోసం కమల్ హాసన్ ఒక క్రేజీ డెసిషన్ తీసుకున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఎలాగో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఖాయం అని తెలిసిందే. ఐతే ఈ సినిమా కోసం ఏకంగా కమల్ హాసన్ మొత్తం పన్నెండు భాషలు మాట్లాడనున్నారట. ఈ సినిమాని 12 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా మొత్తం ఆ 12 భాషల డబ్బింగ్ లను శంకర్ కమల్ తోనే చెప్పించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది మాత్రం అసలు వేరే లెవెల్ అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.