“బింబిసార” పాన్ ఇండియా రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..!

మన తెలుగు సినిమాలు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయో చూస్తున్నాము. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు తెలుగు సినిమాలు కంటెంట్ తో కొడుతుండగా ఈ సినిమాల లిస్ట్ లో మరిన్ని చిత్రాలు యాడ్ అవుతున్నాయి. మరి ఈ లిస్ట్ లో మన తెలుగు సినిమా నుంచి మంచి బడ్జెట్ సహా కొత్త కథతో వస్తున్న చిత్రం “బింబిసార” కూడా ఒకటి.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి చేసిన ఈ చిత్రం తానే స్వీయ నిర్మాణం లో కూడా భారీ బడ్జెట్ పెట్టి చేసాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ విజువల్స్ చూసినప్పుడే పాన్ ఇండియా రిలీజ్ ఉండొచ్చని అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ ముందు అయితే తెలుగు రిలీజ్ కే మేకర్స్ తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ పాన్ ఇండియా వైడ్ ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ తెలుగులో సినిమా హిట్ స్టేటస్ బట్టే ఉంటుంది అని.

ఎలాగో తాము కాన్ఫిడెంట్ గానే ఉన్నామని అలాగే మన దగ్గర పాజిటివ్ టాక్ వస్తే డెఫినెట్ గా జాతీయ భాషల్లో రిలీజ్ ఉంటుంది అని తెలిపాడు. అలాగే ఫస్ట్ డేట్ గా ఆగస్ట్ 18న అనుకుంటున్నామని తాను తెలిపాడు. సో మొత్తానికి అయితే బింబిసార రిలీజ్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు.