Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్… కంగ్రాట్స్ బాబాయ్ అంటూ విష్ చేసిన అబ్బాయిలు!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసినదే. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న సాయంత్రం పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే ప్రముఖులకు కూడా పలువురికి పద్మ అవార్డులు వరించాయి అలాంటివారిలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఈయనకు కూడా పద్మ అవార్డు లభించింది. సినిమా రంగానికి ఈయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మ అవార్డును అందించబోతున్నారు.

ఈ విధంగా బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక అవ్వడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి వారసులు అయిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తమ బాబాయ్ బాలకృష్ణ కు అభినందనలు తెలియజేశారు.

ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి, మీ అవిశ్రాంత ప్రజాసేవకు నిదర్శనం అంటూ బాలకృష్ణకు ఎన్టీఆర్ అభినందనలు తెలియజేశారు.

ఇక కళ్యాణ్ రామ్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుని అందుకున్నందుకు నా బాబాయ్‌ నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు. ఈ గౌరవం మీరు సినిమా ప్రపంచానికి చేసిన అసాధారణ కృషికి, సమాజ సేవలో చేసిన అవిశ్రాంత కృషికి నిజమైన గుర్తింపు అని వెల్లడించారు. అయితే తన బాబాయ్ కి పద్మ భూషణ్ అవార్డు వచ్చిందనే విషయం తెలిసిన వెంటనే ఈ ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీ ఇద్దరు హీరోలను దూరం పెట్టిందని వీరి అభిమానులు ఎంతో ఆవేదన చెందారు కానీ ఇలా తమ బాబాయికి పద్మభూషణ్ అవార్డు రావడంతో ఈ ఇద్దరు వెంటనే స్పందించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి వీరి శుభాకాంక్షలకు బాలకృష్ణ తిరిగి రిప్లై ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.