Kalyan Ram: అమ్మ వద్దంటే ఈ సినిమా చేసే వాడిని కాదు… కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Kalyan Ram: నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నందమూరి హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఈయన కూడా హీరోగా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. హీరోగా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోకపోయినా నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా త్వరలోనే కళ్యాణ్ రామ్ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ చేశారు. ఈ టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని
AAA లో గ్రాండ్ గా నిర్వచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక ఈయన ఈ సినిమాలో విజయశాంతి కూడా కీలకపాత్రలో పోషించిన విషయం మనకు తెలిసిందే. ఇక విజయశాంతి గారిని తాను అమ్మ అంటూ పిలుస్తానని కళ్యాణ్ రామ్ ఇటీవల తెలిపారు. డైరెక్టర్ ప్రదీప్ నాకు ఈ కథ చెబుతున్నంత సేపు కూడా అమ్మ పాత్రలో విజయశాంతి అయితే సరిగ్గా సరిపోతారని ఆ క్షణమే భావించాను అయితే ఈ సినిమాలో నటించడానికి అమ్మ ఒప్పుకుంటేనే చేస్తానని ఒకవేళ అమ్మ ఒప్పుకోకపోతే తాను సినిమా చేయనని డైరెక్టర్ కి ముందుగానే చెప్పాను.

కర్తవ్యం సినిమాలో అమ్మ చేసిన ఫైట్స్, ఎమోషన్స్ మనకి బాగా గుర్తుంటాయి. వైజయంతి పాత్రకి కొడుకు ఉంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో అదే ఈ సినిమా అని డైరెక్టర్ ప్రదీప్ వెల్లడించినట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు. ఇక ఈ సినిమాలో మరోసారి విజయశాంతి పోలీస్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమా నుంచి విడుదలైన టీజర్ మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది.