Nandamuri Heroes: సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. నందమూరి తారక రామారావు నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సేవలు అందించారు ఇక ఈయన వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మూడో తరం వారసులుగా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కొనసాగుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు మరోవైపు కళ్యాణ్ రామ్ సైతం నిర్మాతగాను హీరోగా కూడా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ హీరోలందరూ కూడా వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ఇలా ఈ ముగ్గురు హీరోలు మాత్రమే కాకుండా డెబ్యూ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ సినిమాలో కూడా అదే పాయింట్ ఉండటం గమనార్హం. ఇలా ఈ నందమూరి నలుగురు హీరోల సినిమాలకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలకృష్ణ ఇటీవల డాకు మహారాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుత ఈయన బోయపాటి డైరెక్షన్లో అఖండ సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి దేవర 2 పనులలో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈయన బాలీవుడ్ చిత్రం వార్ 2 షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.
ఇక నందమూరి కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే ఈయన బింబిసారా సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కూడా బింబి సారా సీక్వెల్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఈ ముగ్గురు మాత్రమే కాకుండా మోక్షజ్ఞ కూడా సీక్వెల్ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. బాలకృష్ణ నటించిన ఆదిత్య369 సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఆదిత్య 999 సినిమా ద్వారా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఈ నలుగురు నందమూరి హీరోలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా సీక్వెల్స్ కావటం గమనార్హం.