Ntr: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి ఆదరణ ఉన్న విషయం మనకు తెలిసిందే .సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇంకా నందమూరి వారసులుగా తదుపరి బాలకృష్ణ ఆ తరువాత ఎన్టీఆర్ కళ్యాణ్రామ్ వంటి వారందరూ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇక ఇప్పుడు నందమూరి నాలుగో తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. దివంగత నటుడు హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ కుమారుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పూజా కార్యక్రమాలు ఎన్టీఆర్ ఘాట్ లో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.
ఇక తారక రామారావు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. అయితే తారక రామారావు విషయంలో బాబాయిలైన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా మౌనంగా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. దీంతో మరోసారి ఈ విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.
నిజానికి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సొంత అన్నయ్య జానకిరామ్ కుమారుడే ఈ తారక రామారావు. అలాంటిది తనకు కొడుకు వరుస అయ్యే తారక రామారావు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఇద్దరు బాబాయిలు మౌనంగా ఉండడానికి కారణమేంటంటూ చర్చలు మొదలవుతున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారక రామారావు విషయంలో ఎప్పుడో ఇండస్ట్రీలోకి వెల్కమ్ చెబుతూ ట్వీట్ చేశారు. వైవిఎస్ చౌదరి ఈ సినిమాని ప్రకటిస్తూ తన ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ తారక రామారావుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండడంతో మరోసారి చర్చలు మొదలయ్యాయి.