తెలుగు సినిమా బిగెస్ట్ ఏక్షన్ మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అయితే ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా RRR తో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ ని రేపిన ఎన్టీఆర్ నెక్స్ట్ తన కెరీర్ లో 30 వ సినిమాని దర్శకుడు కొరటాల శివ చేయనున్నాడు.
మరి ఎన్టీఆర్ కూడా తనతో చేయనున్న రెండో సినిమా గా దీనిని చేయనున్నాడు. దీనితో ఈ భారీ సినిమా పై మాంచి అంచనాలు ఇప్పుడు సెట్టయ్యాయి. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి అనేవి సినీ వర్గాల్లో ఆసక్తిగా మారుతున్నాయి.
అయితే ఈ సినిమాకి ఎప్పుడో తాను ఓ టీవీ షో చేసే సమయంలో జనతా గ్యారేజ్ లుక్ లోకి మారి ఆశ్చర్యపరిచాడు. దానితో అప్పుడే స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా ఇలా ఇప్పటి వరకు ఆగుతూ వచ్చింది. అయ్యితే ఈ మధ్యలో ఎన్టీఆర్ భారీగా లావు కావడం అభిమానులు ఆ కొత్త లుక్ చూసి కంగారు పడ్డారు.
మరి ఇదిలా ఉండగా మళ్ళీ వారిని షాకిచ్చేలా రీసెంట్ గా బ్రహ్మస్త్ర ప్రమోషన్స్ లో చాల స్లిమ్ లుక్ కి మరి ఎన్టీఆర్ అందరికి మాట రాకుండా చేసాడు. జస్ట్ నెల వ్యవధిలో ఎన్టీఆర్ లో ఇంత మార్పా అని అనుకున్నారు అంతా..
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ మరింత స్థాయిలో తన లుక్ ఇపుడు మార్చబోతున్నాడని తెలుస్తుండగా దీనిపై అయితే తాను సర్జరీ ద్వారా మారనున్నాడని టాక్ కొందరు అంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదట. ఎన్టీఆర్ ఇప్పుడు సహజంగా బరువు తగ్గుతున్నాడని ఎలాంటి సర్జరీకి వెళ్లడం లేదని కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ చెబుతున్నాయి.