బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జింకల హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటును భాయ్ ను ఈ కేసు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. చివరికీ భాయ్ చేసిన మంచి పనులే ఆ కేసు నుంచి బయపడేసాయి. సామాజిక కార్యక్రమాలు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడంతో భాయ్ కి కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. తప్పు అతనొక్కడే చేసాడా? ఇలాంటివి చాలా మంది చేస్తున్నారని ఓ వ్యక్తి జింకను తుపాకీతో కాల్చుతోన్న ఓ వీడియోను పోస్ట్ చేసి ఇదెక్కిడి న్యాయం అంటూ వర్మ న్యాయస్థానాన్నిఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
సల్మాన్ కి ఒక న్యాయం… ఇంకొకరికి ఇంకో న్యాయమా? అంటూ మండిపడ్డాడు ఆ వీడియో సాక్షిగా. అయితే దీనికి ఓ ఐఎఫ్ ఎస్ ఆఫీస్ వర్మ గూబ గీయిమనేలా కౌంటర్ వేసాడు. ఆ వీడియో ఇండియాలోది కాదు. బంగ్లాదేశ్ లోది. ఆ విషయం అక్కడి పోలీసుల్ని..న్యాయ వ్యవస్థని అడుగు.. ఆవేశ పడొద్దంటూ ట్విటర్ వేదికగా సూటిగా కౌంటర్ వేసాడు. మరి దీనికి వర్మ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూద్దాం.