బాక్సాఫీస్ : ఆశ్చర్యపరుస్తున్న “టైగర్ 3” వసూళ్లు.!

గత కొన్నాళ్ల కితం ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ బాక్సాఫీస్ టర్నోవర్ ఉన్న ప్రముఖ ఇండస్ట్రీ బాలీవుడ్ సినిమా పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. కాగా దీనితో ఓ హిట్ అందుకోవడానికి వారు పడ్డ తపన అంతా ఇంతా కాదు. దీనితో 2023 జనవరిలో ఫైనల్ గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ చేసిన “పఠాన్” బాలీవుడ్ మళ్ళీ ఊపిరి పోసుకుంది.

అక్కడ నుంచి మొదలైన బాలీవుడ్ కం బ్యాక్ ఇపుడు సల్మాన్ ఖాన్ నటించిన అవైటెడ్ చిత్రం “టైగర్ 3” వరకు అయితే వచ్చింది. కాగా ఈ చిత్రం కూడా షారుఖ్ నటించిన పఠాన్ తో లింకప్ అయ్యి ఉన్న స్పై యూనివర్స్ లో భాగం కావడంతో అప్పుడు ఆ చిత్రానికి ఇప్పుడు ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి డోకా లేకుండా పోయింది.

కాగా ఇప్పుడు టైగర్ 3 వసూళ్లు అయితే ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడమే ఆదివారం రిలీజ్ అయ్యింది. అయితే ఇండియా లో ఈ చిత్రం మొదటి రోజు కేవలం 43 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ మాత్రమే అందుకుంటే రెండో రోజు సోమవారం ఏకంగా 58 కోట్లకి పైగా రాబట్టింది.

ఇది మాత్రం షాకింగ్ అంశం అని చెప్పాలి. దీనితో అసలు ఈ సినిమాపై ఉన్న హైప్ కి కానీ రికార్డు నంబర్స్ ఇవి అని చెప్పాలి. ఇదిలా ఉండగా ఇంకా ఈ చిత్రం కొన్ని ఏరియాల్లో అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ ఏ రేంజ్ వసూళ్లు రాబట్టి జస్ట్ రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ అందుకుంది అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి అయితే టైగర్ 3 వసూళ్లు ఓ రేంజ్ లోనే ఉన్నాయని చెప్పుకోవాలి.