ఇండస్ట్రీ బజ్ : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్.. 

టాలీవుడ్ సినిమా ప్రైడ్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తో అయితే సినిమాలో ఇద్దరు హీరోలు సహా దర్శకుడు రాజమౌళి కూడా ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని అయితే తెచ్చుకున్నారు. మరి ఈ భారీ చిత్రం అనంతరం రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ కేవలం ఒక్క సినిమాలోనే ఇరుక్కుపోయాడు. కానీ ఎన్టీఆర్ లైనప్ ఒకింత ఆసక్తిగా ఉంది. ఆల్రెడీ తాను బాలీవుడ్ లో డైరెక్ట్ సినిమా ఓకే చేసాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్ తో భారీ చిత్రం వార్ సీక్వెల్ లో తాను కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.

సౌత్ నుంచి నార్త్ వరకు తారక్ టాలెంట్ అంటే ఏంటో తెలుస్తుంది అని చాలా ధీమా గా ఉన్నారు. అయితే ఇదే అనుకుంటే ఇప్పుడు ఇంకో క్రేజీ ట్విస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వినిపిస్తుంది. అదేమిటంటే ఈ దీపావళి కానుకగా అయితే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన అవైటెడ్ చిత్రం “టైగర్ 3” విడుదల కాబోతుండగా ఈ సినిమాలో అయితే ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉండొచ్చని సినీ వర్గాల్లో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

అంతే కాకుండా ఎన్టీఆర్ పాత్రని సల్మాన్ ఖాన్ పరిచయం చేస్తాడని కూడా అంటున్నారు. మరి ఇదే జరిగితే హైప్ మామూలుగా ఉండదని చెప్పి తీరాలి. ఇప్పటీకే యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ ఫ్రాంచైజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే పఠాన్ లో సల్మాన్ కనిపించాడు. ఇపుడు టైగర్ 3 లో ఎలాంటి సర్ప్రైజ్ లు ఉంటాయా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.