ఆ ముగ్గురు స్టార్స్ విషయంలో మాత్రం చేతులెత్తేసిన వర్మ.!

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఇది అని చూపించిన అతి కొద్ది మంది దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకడు. ఒకప్పుడు తెలుగు సినిమా గతినే మార్చిన వర్మ ఇప్పుడు బి గ్రేడ్ కంటే తక్కువ సినిమాలు చేసే స్థితికి వెళ్ళిపోయాడు. దీనితో రామ్ గోపాల్ వర్మ నుంచి ఇప్పుడు ఏమీ పెద్ద గొప్ప సినిమాలు కూడా ఎవరూ ఆశించడం లేదు.

గత దశాబ్ద కాలం కితం ఏమో రక్త చరిత్ర అనే సినిమా తీసి ఫామ్ లోకి వచ్చినట్టు అనిపించాడు కానీ మళ్ళీ తన గ్రాఫ్ పోగొట్టుకోడానికి ఎంతో సమయం తీసుకోలేదు. అయితే ఇప్పటివరకు వర్మ ఎన్నో సినిమాలు ఎంతోమంది స్టార్స్ ని అమితాబ్ లాంటి వారిని కూడా డైరెక్ట్ చేసాడు.

కానీ ఓ ముగ్గురు హీరోస్ ని మాత్రం తాను హ్యాండిల్ చేయలేను అని చేతులెత్తేశాడు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్స్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ అలాగే జూ ఎన్టీఆర్ ఈ ముగ్గురుతో సినిమా చేయడం నా వల్ల కాదు అని తేల్చేసాడు. వారి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోస్ వారితో సినిమా చేసి వారి ఫ్యాన్స్ ని మెప్పించడం నాకు సాధ్యం కాదని వర్మ చెప్పాడు.

ఇది వరకు అయితే పవన్ ఒకడి విషయంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఇప్పుడు తనతో పాటుగా ఎన్టీఆర్ ప్రభాస్ లని కూడా యాడ్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే తాను తీసిన లేటెస్ట్ చిత్రం “వ్యూహం” రిలీజ్ తో నెక్స్ట్ వీక్ తాను రాబోతున్నాడు. దానికి సీక్వెల్ కూడా నెక్స్ట్ ఉంది.