టాలీవుడ్ సినిమా దగ్గర ఒకప్పుడు భారతదేశ సినిమానే గర్వించదగ్గ సినిమా దర్శకుడు అవుతాడు అనుకుంటే ఇప్పుడు బి గ్రేడ్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడో వర్మ కథ అయిపోయింది. దీనితో ఏదొక కాంట్రవర్సీని పట్టుకొని సర్వైవ్ అవుతున్నాడు. ఇప్పుడు మెయిన్ గా అయితే రాజకీయాలు మీదనే ఫోకస్ పెట్టి వాటి మీదే సినిమాలు చేస్తున్న వర్మ అలా చేసిన నయా చిత్రమే “వ్యూహం”.
ఓపెన్ గానే ఏపీ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించిన వై ఎస్ జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లపై అందులోని వైసీపీ కి అనుకూలంగా సినిమా తీసినట్టుగా ట్రైలర్ అవీ కట్ చేయడంతో అందరికీ అర్ధం అయిపోయింది. అయితే నిజానికి ఈ చిత్రం గత నవంబర్ 10నే రిలీజ్ కావాల్సి ఉంది కానీ సినిమా సెన్సార్ వరకు వెళ్లి ఆగిపోవడంతో రిలీజ్ కి నోచుకోలేదు. పైగా అసలీ సెన్సార్ వరకు ఈ సినిమాకి సెన్సార్ చేసేందుకు కూడా ఒప్పుకోవడం లేదని అంటున్నారు.
మరి ఇప్పుడు చేసేది ఏమి లేక ఈ సినిమాని ఏపీ ఫైబర్ లో నేరుగా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడే ఏపీలో ఫైబర్ నెట్ తో శాటిలైట్ పరంగా కొన్ని చిత్రాలు డైరెక్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. కానీ ఫైనల్ గా అది వర్మ సినిమానే అవుతుంది అని అనుకోలేదు. మొత్తానికి అయితే వ్యూహం పార్ట్ 1 కథ ఇలా ముగిసింది.