తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బిగ్ ప్రాజెక్ట్ “గాడ్ ఫాదర్” సినిమా కూడా ఒకటి. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళ భారీ హిట్ సినిమా “లూసిఫెర్” కి రీమేక్ గా తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా మరిన్ని ఎక్స్ట్రా హంగులతో తెరకెక్కగా వచ్చే నెల అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకి తక్కువ సమయమే ఉండడం పైగా సినిమాపై ఉన్న హైప్ ని స్వయంగా చిత్ర యూనిట్ నే కిల్ చేసుకోడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ క్రమంలో ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అంటూ కొన్ని షాకింగ్ రూమర్స్ కూడా బయటకి వచ్చాయి. మరి ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై అసలు ఇందులో ఎలాంటి నిజం లేదట సినిమాకి కేవలం ఓటిటి సహా థియేట్రికల్ హక్కుల బిజినెస్ పై టాక్ బయటకి వచ్చింది తప్ప..
ఎక్కడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు. దీనితో అయితే గాడ్ ఫాదర్ వార్తలపై ఎలంటూ నిజం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అయితే సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండగా నయనతార, సునీల్, సత్యదేవ్ లు నటించారు. అలాగే థమన్ పాటలు అందించాడు.