‎Junior Movie: ఓటీటీలోకి రాబోతున్న శ్రీలీల జూనియర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?

Junior Movie: టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల, గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన చిత్రం జూనియర్. ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే. భారీ అంచనాలను నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సాంగ్ వైరల్ వయ్యారి. ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.

‎ కిరిటీ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ఎమోషనల్ మూవీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహారించారు. ఈ పాటకు కిరీటి రెడ్డి, శ్రీలీల ఇద్దరు స్టెప్పులను ఇరగదీసారు. కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఈ పాట మారుమోగిందీ. అయితే జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీరిలీజ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.

‎అయితే ఇటీవల ఆహాలోకి వస్తుంది అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డేట్ అనౌన్స్ చేసుకపోయే సరికి ప్రేక్షకులు రిలీజ్ డేట్ కోసం ఎంతగానో ఎదురు చూసారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ విడుదల తేదీన ప్రకటించారు మేకర్స్. అయితే మొదట ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ఈనెల 22 నుంచి అంటే సోమవారం నుంచి స్ట్రీమింగ్ కానుందట. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు కన్నడ వెర్షన్ నమ్మ ఫ్లెక్స్ అనే ఓటీటీలో ఇదే రోజునుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు.