Coolie: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఆగష్టు 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్‌డ్ టాక్ ని తెచ్చుకుంది.
అయితే కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున, ఆమిర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నేడు అనగా సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూలీ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ సినిమా విడుదలైన నెల రోజులు కూడా కాకముందే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూలీ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్ లో చూడని వారు ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేయడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే హిందీ రిలీజ్ గురించి మాత్రం ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే థియేటర్స్ లో కలెక్షన్ల పరంగా బాగానే వసూళ్లను సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి మరి.
Coolie: ఓటీటీలోకి వచ్చేసిన కూలీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
