ఇన్సైడ్ టాక్ : మొత్తానికి ఎన్టీఆర్ సినిమాకి దక్కేది ఈ హీరోయినా.?

తెలుగు లో ఉన్నటువంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఎన్టీఆర్ హీరోగా నటించిన గత సినిమా RRR  వ్యాప్తంగా అలాగే పాన్ ఇండియా లెవెల్లో కూడా రామ్ చరణ్ తో పాటుగా మంచి క్రేజ్ సంపాదించుకోగా ఇక నెక్స్ట్ చేయబోయే తన 30వ సినిమాపై కూడా భారీ స్థాయి అంచనాలు తాను సెట్ చేసుకోగలిగాడు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ సినిమా విషయంలో అంతా బాగానే ఉన్నా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా ఫిక్స్ కాకుండా ఉండడం షాకింగ్ గా మారింది.

అయితే మొదట బాలీవుడ్ నుంచి అనేక మంది స్టార్ హీరోయిన్స్ ని అనుకున్నా కొందరు తప్పుకోవడం కొందరికి డేట్స్ సెట్ కాకపోవడంతో ఎన్టీఆర్ సినిమాకి ఫస్ట్ టైం హీరోయిన్ లేకుండా పోయింది. దీనితో ఇప్పుడు సరికొత్తగా ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం అయితే మేకర్స్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారట. కానీ ఒకవేళ ఆమె మళ్ళీ సెట్ కాకపోతే ఫైనల్ గా రష్మికా మందన్నా ని ఎన్టీఆర్ సరసన తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దీనితో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ మాత్రం ఎలా ఉంటుందో చూడాలి.