రవితేజ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు ఫిక్స్.!

టాలీవుడ్ బిగ్ స్టార్ లో ఒకరైన మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలు కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమాలు ఉన్నాయి. వాటిలో కూడా ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా భారీ ప్రాజెక్ట్ “టైగర్ నాగేశ్వర రావు” సినిమా కూడా ఒకటి.

దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రియల్ లైఫ్ అతి పెద్ద గజదొంగ స్టువర్ట్ పురం టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కొంతమేర కంప్లీట్ చెయ్యగా ఆల్రెడీ ఈ సినిమాపై మంచి అప్డేట్ సహా ప్రీ లుక్ పోస్టర్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చాయి.

ఇక ఈ చిత్రంపై లేటెస్ట్ గా అయితే ఓ బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అయినటువంటి అనుపమ్ ఖేర్ నటిస్తున్నట్టుగా ఒక ఇంటెన్స్ లుక్ ని రిలీజ్ చేశారు. దీనితో  అయితే సినిమాపై మరిన్ని అంచనాలు రేకెత్తుతున్నాయి.

దీనితో ఈ అప్డేట్ మంచి వైరల్ గా మారింది. ఇంకా ఈ చిత్రానికి బాలీవుడ్ హాట్ హీరోయిన్ నపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ దర్శకుడు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చిత్రాన్ని అయితే వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.