బిగ్ న్యూస్ : మహేష్ ఇంట్లో మరో షాకింగ్ ఘటన..ఇంతకీ ఏమైంది అంటే.!

ఘట్టమనేని వారి ఇంట్లో నిన్ననే తీవ్ర విషాదం నెలకొంది.. సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులు అయ్యారు. దీనితో మహేష్ బాబు ఇంట్లో నిన్న ఈ విషాద ఘటనతో అంతా మూగబోగా మళ్ళీ మహేష్ ఇంటి నుంచే ఈరోజు ,మరో షాకింగ్ వార్త బయటికి వచ్చింది.

ఇక మరిన్ని అసలు వివరాల్లోకి వెళితే నిన్న అర్ధ రాత్రి సమయం తర్వాత మహేష్ ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఓ ఆగంతుకుడు వారి ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేసాడట. తాను ఓ దొంగతనము కోసం మహేష్ ఇంట్లో ప్లాన్ చేసుకోగా 30 అడుగుల గోడని అయితే తాను పైకి బాగానే ఎక్కేసాడు కానీ అక్కడ నుంచి కిందకి దూకడంతో ఇంట్లో ఒక్కసారిగా పెద్ద శబ్దం అయ్యింది.

దీనితో ఇంట్లో అంతా ఒక్కసారిగా మేల్కొనగా అప్పుడుకే ఆ దొంగ చాలా గాయాలు పాలయ్యాడు. దీనితో వెంటనే ఆసుపత్రికి అలాగే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. దీనితో అయితే ఇప్పుడు ఆ ఆగంతుకుడకి చికిత్స అందిస్తున్నారట. మొత్తానికి అయితే మళ్ళీ మహేష్ ఇంట్లో మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి.