రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులమ్ముకున్న బాబూ మోహన్

సంపాదనకు అనేక మార్గాలు . ఇప్పుడు ఎక్కువ పేరు , డబ్బు సంపాదించడాని రాజకీయాలు సులువైన మార్గం అయిపొయింది . ఒకప్పుడు సమాజానికి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చేవారు . నిజం చెప్పాలంటే ఇప్పుడు సంపాదించడానికి రాజకీయాలను ఎంచుకుంటున్నారు .

అయితే ఈ రోజుల్లో కూడా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవడం అటుంచి ఆస్తులు అమ్ముకొనే వారు కూడా వున్నారు . అయితే  వీరి శాతం  చాలా తక్కువ . ఇలాంటి నాయకుల్లో బాబూ మోహన్ కూడా చేరిపోయాడు .

బాబూ మోహన్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి  నాటకాలు వేసుకుంటూ ఉండేవాడు . 1987లో నిర్మాత కె. రాఘవ :ఈ ప్రశ్నకు బదులేది ” సినిమాతో సినిమా రంగానికి నటుడుగా పరిచయం అయ్యాడు . అక్కడ నుంచి బాబూ మోహన్  తిరిగి చూడ లేదు . నందమూరి తారక రామా రావు మీద అభిమానంతో తెలుగు దేశం పార్టీలో చేరాడు . మెదక్ జిల్లా ఆందోల్ నుంచి శాసన  సభకు ఎన్నికై కార్మిక శాఖ మంత్రిగా పని చేశాడు . 2014లో టీఆరెస్  పార్టీలో చేరాడు . అయితే వచ్చే ఎన్నికల్లో ఆడా నియోజక వర్గానికి క్రాంతి అనే యువకుడికి కేసీఆర్ టికెట్ ఇచ్చాడు . బాబూ మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరాడు . ఇక బాబూ మోహన్ మీద అనేక ఆరోపణలు వున్నాయి కాబట్టే టీఆరెస్ టికెట్ ఇవ్వలేదనే  వార్తలు వెలువడ్డాయి . దీనిపై బాబూ మోహన్  స్పందించాడు .

తానూ సినిమాల్లో నటుడుగా ఎంతో సంపాదించుకొని పొలాలు , ఇళ్ళు  కొనుకున్నానని , రాజకీయాల్లోకి వచ్చాక ఆంధ్రాలో వున్న కొబ్బరి తోట, ఖమ్మం లో వున్నా ఇల్లు , మద్రాస్ లో వున్నా ఇంటి స్థలం , హైదరాబాద్ ఫిలిం నగర్లో ఉన్న ఇల్లు అమ్ముకున్నానని చెప్పాడు .

ఇక తనపై వచ్చిన ఆరోపణలు బదులిస్తూ , నేను నిజాయితీగా పనిచేస్తా , ప్రజలకోసమే కృషి చేస్తా , అందుకే నన్ను ఆందోల్ నుంచి మూడు  సార్లు ప్రజలు గెలిపించారు . వచ్చే ఎన్నికల్లో బీజేపీ  అభ్యర్థిగా ఆందోల్  నుంచే పోటీ చేస్తానని చెప్పాడు .

ముక్కు సూటి తనం , తొందర పాటు బాబూ  మోహన్ ను విమర్శలు పాలు చేస్తున్నాయా ?