Failure Boys: బాబు మోహన్ ముఖ్య అతిథిగా “ఫెయిల్యూర్ బాయ్స్” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

Failure Boys: క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్ పై వి ఎస్ ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించగా విజయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఫెయిల్యూర్ బాయ్స్” సినిమా డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో ఈ చిత్ర బృందం రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

ఫెయిల్యూర్ బాయ్స్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన బాబు మోహన్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది. పాటలు చాలా బాగా వచ్చాయి. నిర్మాత కుమార్ గారు నిర్మాణ సంస్థను ప్రారంభించి అందరికీ సపోర్ట్ చేస్తూ రావడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

శ్రీనివాస్ జమ్మి మాట్లాడుతూ... “ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఫెయిల్యూర్ బాయ్స్ అనే ఈ చిత్రం మా మనసు పెట్టి తీశాము. ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కష్టపడి చేశాము. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాము” అన్నారు.

నటుడు పింగ్ పాంగ్ వీడియో మాట్లాడుతూ... “ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన బాబు మోహన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి చేశారు. ముగ్గురు ప్రేమ కథలు ఎలా ఉంటాయి అనేది ఎవరు ఊహించి ఉండరు. విజువల్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు ఎంత అద్భుతంగా వచ్చాయి. నిర్మాత కుమార్ గారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు విజయ్ గారి సంగీతం మరింత బలాన్ని ఇస్తుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను” అన్నారు.

అంజి శ్రీను మాట్లాడుతూ… “నిర్మాత కుమార్ గారికి, డైరెక్టర్ వెంకటరెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. చాలా కష్టపడి ఎక్కడ కాంప్రమైదవకుండా ఈ సినిమాను చేయడం జరిగింది. నేటి తరానికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత వి ఎస్ ఎస్ కుమార్ మాట్లాడుతూ... “ఫెయిల్యూర్ బాయ్స్ అంటే ఎవరు ఉండరు. జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితేనే జీవితంలో ఎలా పైకి రావాలో తెలుస్తుంది. అందరికి నమస్కారం. నేను ఒకప్పుడు మీడియాలో పని చేశాను. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. దర్శకుడు మరింత కష్టపడ్డారు. ఆయన ఒక బ్యాంకు మేనేజర్. అయినప్పటికీ సెలవులు పెట్టి మరీ, నాకు ధైర్యం చెబుతూ ఈ సినిమాను పూర్తి చేశారు. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది” అన్నారు.

దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి ఉసిరిక మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా మేము ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నిర్మాతలు నన్నే దర్శకత్వం వహించమన్నారు. ఎంతో కష్టపడి విజయవంతంగా ఈ సినిమాను పూర్తి చేసాము. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులంతా కుటుంబ సమేతంగా వచ్చి ఈ చిత్రాన్ని చూడొచ్చు. నా తొలి చిత్రానికి ఇంతగా సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హీరో అవి తేజ్ ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్ తో నటించారు. ఈ సినిమా చూసి మీరు ఫీల్ గుడ్ అవుతారని హామీ ఇవ్వగలను. ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ కోయిల్ దాస్ మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. మీ అందరిని ఇలా కలవడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కాబోతున్న ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాను ప్రేక్షకులంతా ఆశీర్వదించి గొప్ప విజయాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

హీరో అవి తేజ్ మాట్లాడుతూ… “ఫెయిల్యూర్ అంటే విజయానికి మరొక మెట్టు. ఫెయిల్యూర్ బాయ్స్ అనే చిత్రం ఒక యుద్ధం అనుకుంటే యుద్ధంలో యుద్ధ వీరులు మా నిర్మాతలు. ఎందుకంటే ఈ చిత్రానికి వారే హీరోలు. ఒక నిర్మాత్మ సంస్థను నడిపించడం అంత సులువైన విషయం కాదు. సినిమాలోని క్వాలిటీ చూస్తే అది మీకు అర్థమవుతుంది. సినిమాలో ఎక్కడ కాంప్రమైస్ కాకుండా తీశారు. ఒక సినిమాకు నిర్మాత వెన్నుముకల నిలబడతారు. ఈ సినిమాని నిర్మాతలు మాకు అలా నిలబడ్డారు. మా చిత్ర దర్శకులు నాకు కథ చెప్పినప్పుడు నాకు సెట్ అవుతుందా లేదా అనుకున్నాను.

కానీ దర్శకులు నన్ను ప్రతి విషయంలో గైడ్ చేస్తూ నాతో సరేనా అవుట్ పుట్ వచ్చేలా నటించేలా చేశారు. రోజుకు ఒక్క సీన్ మాత్రమే ప్లాన్ చేసేవారు. నా స్నేహితుడు ప్రదీప్ ఎంతో టాలెంట్ గా ఉన్నావు నటుడు. సెట్లో ప్రదీప్ ఉంటే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది. చాలా బాగా డాన్స్ చేస్తాడు. తనను తాను వెండి తెరపై చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అంత సరదా మనిషి ఈరోజు మనమధ్య లేడు. దయచేసి ఎవరు తమ జీవితంలో జరిగే సంఘటనలకు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఈ సినిమాను అతనికి అంకితం చేస్తున్నాము” అంటూ ముగించారు.

ఈ కార్యక్రమంలో “ఫెయిల్యూర్ బాయ్స్” చిత్రానికి పనిచేసిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని సినిమా విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నటీనటులు : క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని, సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, కోయల్ దాస్, తదితరులు

టెక్నికల్ టీమ్ :
ఎడిటింగ్ – ఎంఆర్ వర్మ
డీవోపీ – దాము నర్రావుల
మ్యూజిక్ – విజయ్ బుల్గానిన్
బ్యానర్ – శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్
పి ఆర్ ఓ: వీరబాబు బాసింశెట్టి

రాజీనామా || Advocate Bala About Arnab Goswami on Ram Mohan naidu & Nara Lokesh || Indigo Crisis ||TR