షాక్ : ‘అరవింద సమేత’ సోమవారం దెబ్బ కొట్టేసింది

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రం  ఇటీవల దసరా కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి రోజు నుంచీ డివైడ్ టాక్ నడుస్తోంది. ఇది కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చే చిత్రమే అని, ఫేక్ కలెక్షన్స్ తో ప్రకటనలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.

అయితే మీడియాలో మాత్రం  చిత్రం విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం దిశగా దూసుకుపోతోంది. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రికార్డులను తిరగరాస్తూ.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.   నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తున్నాడంటూ సినిమా ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.   ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి… సోమవారం నుంచి కలెక్షన్స్ లో  ఏమైనా మార్పు వచ్చిందా వంటి విషయాలు ట్రేడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు చూద్దాం.


భారీ ఎక్సపెక్టేషన్స్ మధ్య రిలీజైన ‘అరవింద సమేత’కు కూడా మొదటి రోజు..  ఫస్ట్ వీకెండ్ లో భారీగానే వసూళ్లు వచ్చాయి. కానీ సోమవారం కలెక్షన్స్ లో మార్పు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్స్ లో మేజర్ డ్రాప్ ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం.  చాలా చోట్ల .. ఆక్యుపెన్సీ సగం కూడా లేదు. టోటల్ గా 25 శాతానికి వసూళ్లు పడిపోవటం గమనించ తగ్గ విషయం. అలాగే..

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‘అరవింద సమేత’ను నాలుగు థియేటర్లలో వేసారు. సోమవారం ఒక థియేటర్ నుంచి ‘అరవింద సమేత’ను తీసేశారు.  కాకపోతే ఎంత పెద్ద హిట్ సినిమా అయినా …సోమవారం కలెక్షన్స్ లో తేడా కనపుడుతంనది,   దసరా సెలవుల కాబట్టి మళ్లీ సినిమా పుంజుకునే అవకాశాలు  ఉందీ అంటున్నారు. చూడాలి మరి ఫైనల్ గా ఈ చిత్రం ఏమవుతుందో…యావరేజా, హిట్టా అనేది తేలాల్సి ఉంది.