హీరో కాకముందే  సూపర్ స్టార్,  హీరో అయ్యాకే జీరో ! 

అక్కినేని అఖిల్.. హీరో కాకముందే సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లిపోతాడని విపరీతమైన క్రేజ్ ని సంపాధించాడు. కానీ ఏం లాభం.. చివరకి హీరో అయ్యాక సూపర్ స్టార్ మాట పక్కన పెడితే..ఎవరేజ్ హిట్ ను సాధించడానికే కిందామీదా పడుతూ పడలేక బండి లాగుతున్న ఒక సాధారణ హీరో. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఇది కూడా ప్లాప్ అయితే ఇక అఖిల్ కి ఇప్పుడు ఉన్న మార్కెట్ కూడా ఇక ఉండదు. అందుకే నాగార్జున సైతం ఈ సినిమా పై ముందు నుంచీ విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటూ.. డైరెక్టర్ ను తినేస్తున్నాడు. దీనికి తోడూ ఈ లాక్ డౌన్ ఒకటి.. పూర్తి ఖాళీ సమయం దొరకడంతో నాగ్ అఖిల్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టి మరీ చెక్ చేస్తున్నాడు.

కానీ, ఈ సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయినట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇవి కేవలం రూమర్స్ అట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వచ్చాయని, ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయని.. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని తెలుస్తోంది. చూడబోతుంటే ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

ఏమైనా అఖిల్ గత సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అఖిల్ కూడా ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు అఖిల్ కూడా దగ్గర ఉండి ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.