Akhil Zainab wedding: ప్రేయసి జైనాబ్ తో అఖిల్ వివాహం… నాగార్జున ప్లానింగ్ మామూలుగా లేదుగా?

Akhil Zainab wedding: అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన తన ప్రేయసి జైనాబ్ తో కలిసి ఏడడుగులు వేశారు. వీరి వివాహం జూన్ ఆరో తేదీ ఎంతో ఘనంగా జరిగింది. కొంతమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ వివాహం జరిగినప్పటికీ జూన్ 8వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు సినిమా రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

ఇదిలా ఉండగా అఖిల్ జైనాబ్ వివాహం కావడంతో అఖిల్ కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యారని తెలుస్తోంది. జైనాబ్ తండ్రి జుల్ఫీ రావ్‌జీ ప్రముఖ వ్యాపారవేత్త జేఆర్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా దూసుకుపోతున్నారు అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంక్ హోదా పదవి కూడా చేపట్టారు. ఇలా రియల్ ఎస్టేట్ కావడంతో నాగార్జునతో మంచి పరిచయం ఏర్పడింది. ఇక జుల్ఫీ రావ్‌జీ కుమార్తె జైనాబ్ పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.దేశంలోని వివిధ నగరాలతో పాటు దుబాయ్, లండన్‌లోనూ తన ఆర్ట్ వర్క్ ఎగ్జిబిషన్స్‌ ద్వారా ప్రజలకు చూపించారు.

ఓసారి లండన్ లో తన ఆర్ట్ వర్క్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో భాగంగా అక్కినేని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో అఖిల్ తో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. ఇలా వీరిద్దరూ ప్రేమించుకుంటున్న నేపథ్యంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక జైనాబ్ ను అఖిల్ వివాహం చేసుకోవడంతో వారి వ్యాపారాలకు ఆస్తిపాస్తులకు ఈయన వారసుడిగా మారిపోయారు. ఇక వీరికి హైదరాబాద్ , ముంబైతో పాటు విదేశాలలో కూడా పెద్ద ఎత్తున బిజినెస్ లు ఉన్నాయని తెలుస్తుంది.