Nagarjuna: నా కొడుకు సినిమాలో జగపతిబాబు వద్దు… ఘోరంగా అవమానించిన నాగార్జున!

Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అక్కినేని నాగార్జున జగపతిబాబు వంటి వాళ్ళు ఒకరు. ఇద్దరు కూడా సినీ నేపథ్యమైన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగు పెట్టారు. ఇద్దరూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికీ వరుస సినిమాల ద్వారా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా నాగార్జున తాజాగా జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరు సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున జగపతిబాబును అవమానించిన సంఘటన గురించి కూడా బయటపెట్టారు. ఇటీవల నాగార్జున తన చిన్న కుమారుడు అఖిల్ వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించిన సంగతి తెలిసిందే అయితే ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు అయితే జగపతిబాబుని మాత్రం నాగార్జున ఆహ్వానించకుండా అవమానించారని తెలుస్తోంది ఈ క్రమంలోని నీ కొడుకు పెళ్లికి ఎందుకు నన్ను పిలవలేదు అంటూ నిలదీశారు.

ఇకపోతే అఖిల్ హీరోగా నటించిన సినిమాలో ఓ పాత్రలో కూడా నేను నటించకూడదని కండిషన్లు పెట్టావు అంటూ జగపతిబాబు మాట్లాడటంతో నాగార్జున వివరణ ఇచ్చుకున్నారు. నిజానికి అఖిల్ సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం జగపతిబాబును తీసుకుందామని చెప్పారు కానీ ఇండస్ట్రీలో మీకున్న స్టేటస్ దృష్టిలో పెట్టుకొని అలాంటి చిన్న పాత్రలో అవకాశం ఇవ్వడం మంచిది కాదనిపించింది అందుకే జగపతిబాబు గారికి ఈ పాత్రలో చేసే ఛాన్స్ ఇవ్వద్దని తాను చెప్పాను అంటూ అసలు విషయం బయట పెట్టారు. ఇలా నాగార్జున క్లారిటీ ఇవ్వటంతో నాగార్జున నిర్ణయం పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.