Shivaji: ఆ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకున్న నటుడు శివాజీ.. మరోసారి అలాంటి పాత్రలో నటించనున్నారు!

Shivaji: టాలీవుడ్ నటుడు శివాజీ ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు హీరోగా నటుడిగా వరస సినిమాలలో నటించి మెప్పించిన శివాజీ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరగడంతో పాటు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలలో కూడా నటిస్తున్నారు శివాజీ. కాగా ఇటీవల విడుదల అయినా 90sబయోపిక్ సిరీస్ లో నటించి మెప్పించారు. తర్వాత నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు శివాజీ. కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అదరగొట్టారు. కోర్ట్ సినిమా తర్వాత శివాజీ పేరు మరోసారి ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయన మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని సమాచారం. అక్కినేని అఖిల్ నటిస్తున్న నయా మూవీలో శివాజీ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

లెనిన్ సినిమాలో శివాజీ రోల్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని టాక్. అంతేకాకుండా మరోసారి ఆయన నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారట. కోర్ట్ మూవీలోని మంగపతి తరహా పాత్రలోనే శివాజీ లెనిన్ లో కనిపిస్తారని సమాచారం. అయితే త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఒకవేళ ఇది నిజం అయ్యే సినిమా సక్సెస్ అయితే మాత్రం శివాజీకి మరోసారి అవకాశాలు క్యూ కట్టడం కాయం అని చెప్పవచ్చు.