Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. మొన్నటి వరకు తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు కాస్త స్లో అయిందని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది శ్రీ లీల. సరైన హిట్ పడకపోయినప్పటికీ సినిమాలు సక్సెస్ కాక పోయినప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్ కావడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్స్ శ్రీలీల కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే.. శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు , ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అఖిల్ సరసన లెనిన్ అనే మూవీ కూడా చేస్తోంది. ఈ ఏప్రిల్‌లో అఖిల్, శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఒక వీడియో రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఏడాది దీపావళికి ఈ మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్ ని చూసుకోవాలని టీమ్ భావిస్తుందట.
అందుకే ఈ సినిమాలో నుంచి హీరోయిన్ శ్రీలను మూవీ మేకర్స్ తీసేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే హీరోయిన్ శ్రీ లీల విషయానికొస్తే చివరగా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త్వరలో మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.