ఇండస్ట్రీ టాక్ : ఆరోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫైనల్ గా గుడ్ న్యూస్.?

పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్(RRR) సినిమా తర్వాత ఈ సినిమా ఇద్దరు హీరోల క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. దీనితో ఇద్దరి హీరోల నెక్స్ట్ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొనగా రామ్ చరణ్ తన సినిమా శంకర్ తో బిజీ గా ఉండగా ఎన్టీఆర్ అయ్యితే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ అలాగే దర్శకుడు బుచ్చిబాబు లతో లాక్ చేసుకున్నాడు.

కానీ తర్వాత మాత్రం కొరటాల శివతో సినిమా స్టార్ట్ చెయ్యాల్సి ఉండగా ఇది అయితే ఎప్పుడు మొదలు అవుతుందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. పైగా హీరోయిన్ కూడా ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాకపోవడంతో అభిమానుల్లో మరింత సస్పెన్స్ నెలకొంది.

ఇక ఫైనల్ గా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పే రోజు మరీ అంత పెద్ద గుడ్ న్యూస్ కాకపోవచ్చు కానీ చిన్న ఊరట ఇచ్చే అప్డేట్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అక్టోబర్ 10న అయితే ఆ గుడ్ న్యూస్ ఏదో రాబోతుందట. మరి అదేంటో వేచి చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.