“దేవర” కి రికార్డు డీల్ ఓకే కానీ.. అంత రాబట్టే సీనుందా?

ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి రానున్న పలు భారీ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చిత్రం “దేవర పార్ట్ 1” కూడా ఒకటి కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా మేకర్స్ హాలీవుడ్ లెవెల్ విజువల్స్ తో అయితే చాలా గ్రాండ్ గా సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంపై ఉన్న హైప్ కి గాను ఆల్రెడీ భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది అని టాక్ ఉంది. కాగా ఇప్పుడు దేవర యూఎస్ మార్కెట్ కి సంబంధించి పలు రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. దీనితో యూఎస్ లో ఈ సినిమాకి ఏకంగా 45 కోట్లకి పైగా బిజినెస్ ని జరిపినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అంటే ఈ చిత్రం ఈజీగా 6 మిలియన్ డాలర్స్ ని రాబట్టాల్సి ఉంటుంది. అయితే సినిమాపై మంచి హైప్ ఉంది కానీ ఇప్పుడు ఈ హైప్ లో కూడా అక్కడ నుంచి ఇంత రేంజ్ వసూళ్లు రాబట్టి సినిమా లాభాల్లోకి వెళ్లడం అనేది కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఎన్టీఆర్ కి యూఎస్ లో మంచి మార్కెట్ ఉంది కానీ తన సినిమాలు ఈ రేంజ్ వసూళ్లు అందుకున్న సినిమాలు పెద్దగా ఏమి లేవు.

దాదాపు 3 లేదా 4 మిలియన్ వరకు అయితే ఓకే అనుకుంటున్నారు కానీ 6 మిలియన్ అంటే ఎన్టీఆర్ బ్రేకీవెన్ కొట్టడం కాస్త కష్టమే అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి దేవర ఎలా రన్ అవుతుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.