ఇండస్ట్రీ టాక్ : “దేవర” రిలీజ్ అప్పటికి ప్లాన్ చేస్తున్నారా??

పాన్ ఇండియా సినిమా దగ్గర ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్న పలు చిత్రాల్లో దర్శకుడు కొరటాల శివ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో చేస్తున్న రెండో సినిమా అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా “దేవర పార్ట్ 1” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం ఇప్పుడు దాదాపు ఫినిషింగ్ స్టేజి లోకి రాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులు నుంచి అయితే ఒక ఊహించని టాక్ వైరల్ గా మారింది. దీనితో దేవర దాదాపు ఉగాది బరిలో తప్పుకుంది అనే సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేసారు. అయితే ఇప్పుడు మరి కొత్త రిలీజ్ ఏంటి అనేది ఆసక్తిగా మారగా మేకర్స్ ముందు పెద్ద సవాలే ఎదురైంది.

ఏపీలో ఎన్నికలు మూలాన రిలీజ్ డేట్ ని మార్చాలా వద్దా అనేది ఒకటి అయితే రెండోది ఈ చిత్రం ఒకవేళ అప్పుడు వాయిదా పడితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ప్రశ్న. కాగా దీనికి గాను ఈ చిత్రం అన్నీ తిరిగి దసరా రేస్ లో రిలీజ్ చేస్తారు అన్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి.

అయితే అప్పటికి వేరే సినిమాలు ఇంకా ఏవి ఫిక్స్ కాలేదు అని అందుకే ఆ డేట్ లో సినిమాని లాక్ చేసుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నాడు అలాగే అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.