“దేవర” వాయిదాకి ఇవి కూడా కారణం..?

ఎప్పటిలా లేదు టాలీవుడ్ నుంచి ఉన్న కొన్ని భారీ చిత్రాలు ఆన్ టైం లోనే రిలీజ్ అవుతున్నాయి అనుకున్న సమయంలోనే ఒకో సినిమా వాయిదాతో మళ్ళీ మొదటికే వచ్చింది అన్నట్టుగా ఫ్యాన్స్ కి గడ్డుకాలం స్టార్ట్ అయ్యింది. అయితే ఈ వాయిదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం “దేవర” నుంచే స్టార్ట్ అయ్యింది.

కాగా ఈ చిత్రం అనుకున్నట్టే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది. ఇక జనవరి నుంచి అప్డేట్స్ కూడా స్టార్ట్ చేశారు అంతా బాగానే ఉంది అని అనుకున్న సమయంలో సినిమా వాయిదా వార్తలు కమ్మేశాయి. కానీ స్టార్టింగ్ లోనే ఈ చిత్రం వాయిదా లేదని చిత్ర టీం కన్ఫర్మ్ చేశారు కానీ ఏపీలో ఎన్నకలు ఏప్రిల్ లోనే వస్తుండడంతో వాయిదా ఖరారు అయ్యిపోయింది.

ఇక ఈ డేట్ లోకి పలు చిన్న చిత్రాలు వస్తున్నట్టుగా కూడా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే నిన్ననే విజయ్ దేవరకొండ నటిస్తున్న అవైటెడ్ చిత్రం ది ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని మేకర్స్ అదే ఏప్రిల్ 5 డేట్ కి ఫిక్స్ చేయగా దేవర వాయిదా అనేది కన్ఫర్మ్ అయ్యిపోయింది.

అయితే అసలు ఈ సినిమా వాయిదాకి కారణాలు ఏంటి అనే వాటిలో గత జనవరిలో అనుకున్నట్టుగా షూటింగ్ జరగలేదట. అలాగే అనిరుద్ వర్క్ కూడా పెండింగ్ ఉండడం ఇంకా గ్రాఫిక్ పనులు కూడా కొనసాగుతూ ఉండడంతో “దేవర” వాయిదాకి మరిన్ని కారణాలు అని సినీ వర్గాల్లో టాక్. దీనితో దేవర వాయిదా కావడానికి ఇవన్నీ కారణాలుగా మారాయని చెప్పాలి.