అప్పుడే 10 ఏళ్ళు పూర్తి అయింది

క‌మ‌ల్ కూతురిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈమే న‌టిగానే కాక సింగ‌ర్‌గా, రైట‌ర్‌గా ప‌లు విభాగాల‌లో త‌న స‌త్తా నిరూపించుకుంది. 2009 జూలై 24న విడుద‌లైన హిందీ చిత్రం ల‌క్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చింది శృతి. తెలుగులో గ‌బ్బ‌ర్ సింగ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో విజయ్‌సేతుపతి సరసన లాభం అనే చిత్రం, టాలీవుడ్‌లో రవితేజతో ఒక చిత్రం చేయ‌నుంది.

రీసెంట్ గా అమెరికాకి చెందిన ‘ట్రెడ్‌స్టోన్‌’లో శృతి హాస‌న్ కీల‌క పాత్ర ఎంపికైంది. ఇంగ్లీష్ లో వెబ్ సిరీస్‌గా రూపొంద‌నున్న ట్రెడ్ స్టోన్‌ని రామిన్ బ‌హ్రానీ తెరకెక్కించ‌నున్నారు. కెరీర్‌లో 10 ఏళ్ళు పూర్తి చేసుకోవ‌డంతో శృతి హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.