టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్టు గురించి ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా గాల్లో చక్కర్లు కొడుతోంది. అంతటి ఆసక్తికి కారణం.. జక్కన్న సృష్టించే విజువల్ వెండర్, అలాగే మహేష్ బాబు మ్యాజిక్. అయితే అందరూ ఊహించిందే జరగదన్నట్లుగా.. ఈసారి ఈ సినిమా షూటింగ్ ఒక కొత్త తరహా టోన్‌లో నడుస్తుండడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
పనికి శ్రద్ధపెట్టే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళితో సినిమా అంటే, హీరోలు నానా పాట్లు పడాల్సిందే. గతంలో బాహుబలి కోసం ప్రభాస్, రానా నెలల తరబడి ట్రైనింగ్ చేశారు. RRR కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ శరీరాన్ని కొత్తగా మలచుకున్నారు. కానీ SSMB 29 విషయంలో అంచనాలకు విరుద్ధంగా మహేష్ బాబు చాలా రిలాక్స్‌డ్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. షూటింగ్ జరుగుతున్నా, అతను తన రెగ్యులర్ లైఫ్‌లో ఏవిధమైన ఒత్తిడిని చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు రాజమౌళి ప్రాజెక్టులన్నింటిలోనూ హీరో ఫిజికల్‌గా మారాల్సిన అవసరం తప్పనిసరిగా ఉండేది. కానీ ఈసారి మహేష్ బాబుకి పెద్దగా బాడీ మేకోవర్ అవసరం లేదని టాక్. కేవలం హెయిర్ స్టైలింగ్‌లో కొన్ని మార్పులు తప్ప, అతని లుక్‌లో పెద్దగా మార్పులు ఉండవని సమాచారం. ఇది అభిమానులను ఆశ్చర్యపరిచే అంశం. జక్కన్న సినిమాల్లో హీరోలు ట్రాన్స్‌ఫర్మేషన్‌కు టైం పట్టేలా ఉండేది. కానీ ఈసారి అతను కామ్ఫర్ట్ జోన్లో ఉన్నాడు అనిపిస్తోంది.
మహేష్ బాబు ఏడాది రెగ్యులర్‌గా ఫ్యామిలీ ట్రిప్స్‌కి వెళ్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే రాజమౌళి సినిమా పట్టాలు ఎక్కిందో, ఈసారి కూడా మహేష్ తన హాలిడే ప్లాన్స్‌ను ముందుగానే ఫిక్స్ చేసుకోగలిగాడు. అంటే షూటింగ్ బ్రేక్‌లు ఎక్కువగా ఉండటం వల్లే. ఇది రాజమౌళికి కూడా ఓ కొత్త అనుభవం. ఓ వైపు సినిమాపై క్రేజ్ పెరిగిపోతున్నా, షూటింగ్ మాత్రం చాలా సైలెంట్‌గా, ఏ హడావుడీ లేకుండా సాగుతోంది.
ఇటీవలి వస్తున్న వార్తల ప్రాకం.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా SSMB 29 సెట్స్‌లో అడుగుపెట్టింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. ఇంత వరకూ రాజమౌళి సినిమాలన్నీ హై వాల్యూమ్ హైప్తో నడిచినా.. ఈసారి మాత్రం తక్కువ హడావుడితో సినిమా ముందుకు సాగుతోంది. అయితే ఇది దర్శకుడు అనుకున్న ప్లాన్‌లో భాగమా లేక కొత్త గా ప్రయత్నం చేస్తున్నాడా అన్నది తెలియాలి. కానీ అభిమానుల్లో మాత్రం ఒకే అనుమానం.. ఇంత సైలెంట్‌గా తెరకెక్కుతున్న సినిమా తెరపై ఎలా ఉండబోతోందో.. అని మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.