హిందీ సినిమాలతో లాభం లేదు.. స్ట్రెయిట్ తెలుగు సినిమాతో.. పాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టాలి.! బాలీవుడ్ ప్రముఖుల్లో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ ఇది. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్, తెలుగు నేటివిటీతో కూడిన సినిమా చేశాడు ‘కిసీ కీ భాయ్.. కిసీ కీ జాన్’.
ఇప్పుడేమో, షారుక్ ఖాన్ ఏకంగా స్ట్రెయిట్ తెలుగు మూవీ.. అంటున్నాడట. తెలుగు దర్శకుడు.. తెలుగు నిర్మాణ సంస్థతో టై-అప్.. ఇలా సరికొత్త ఆలోచనలతో షారుక్ ఖాన్, హైద్రాబాద్‌లోని తనకు అత్యంత సన్నిహితులైన కొందరు తెలుగు సినీ ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరున హైద్రాబాద్‌కి వచ్చి మరీ, ఆ మంతనాల్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడట షారుక్ ఖాన్. తెలుగు సినిమాలకి జాతీయ స్థాయిలో పెరిగిన మార్కెట్.. హిందీ సినిమాలకు తగ్గిన మార్కెట్.. ఇవే, షారుక్‌లో వచ్చిన కొత్త మార్పుకి కారణమట.
అన్నట్టు, షారుక్ మూలాలు హైద్రాబాద్‌లోనే వున్నాయండోయ్.