Kuber: బిచ్చమెత్తడం నా వల్ల కాదు.. కుబేరా సినిమాని రిజక్ట్ చేసిన హీరో ఎవరంటే..?

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో… క్లాస్ మేకింగ్‌కు పేరుగాంచిన శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘కుబేర’ జూన్ 20న విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. రష్మిక మందన్న హీరోయిన్ నటించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా, మొదటి షో నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బిచ్చగాడు పాత్రలో ధనుష్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తుండగా, శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ డిఫరెంట్ ప్రయత్నం ఎంత గొప్పదో మరోసారి నిరూపితమైంది. తిరుపతి వీధుల్లో బిచ్చం అడుగుతున్న ధనుష్ పాత్రలోని మానవీయత, గాఢత, నటన అంతా కలసి ప్రేక్షకులను ఎమోషనల్ చేయగా, ఇది ఆయన కెరీర్‌లో మరొక ప్రత్యేక విజయంగా నిలిచింది.

అయితే ఈ విజయవంతమైన పాత్ర ముందుగా ధనుష్‌కు కాకుండా టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండకు ఆఫర్ అయిందని టాక్ హాట్‌గా మారింది. శేఖర్ కమ్ముల.. విజయ్ దేవరకొండల మధ్య ఉన్న స్నేహంతో మొదటగా ఈ క్యారెక్టర్‌ను ఆయనకే ఆఫర్ చేశారని, కానీ బిచ్చగాడి పాత్ర నాకిష్టం లేదు అని చెప్పి ఆయన వదిలేశారట. తాను చేసే రోల్స్‌కు ఇది సరిపడదని వద్దనుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ రోలులో ధనుష్ నటించి భారీ హిట్ కొట్టిన నేపథ్యంలో, “విజయ్ దేవరకొండ జీవితంలో మిస్ అయిన బంపర్ ఆఫర్ ఇదే కాబోలు” అంటూ నెట్టింట నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక పెద్ద విజయం తన చేతిలోనుంచి జారిపోయిందని అంటున్నారు. అయితే చివరికి ఈ ప్రయోగాత్మక కథను ధనుష్ ఒప్పుకుని ధైర్యంగా పోషించడంతో, ఆ పాత్రకు న్యాయం జరిగిందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. పాత్రలు ఎలా ఉంటాయన్నదానికన్నా, వాటిని ఎలా సమర్ధవంతంగా పోషించామన్నదే ప్రధానమైనది.