సినిమా క‌ష్ట‌కాలం..ఇంకెన్నాళ్లో? దేవుడికే ఎరుక‌!

సినిమా క‌ష్ట‌కాలం..ఇంకెన్నాళ్లో? దేవుడికే ఎరుక‌!

కేరళ రాష్ర్ట ప్రభుత్వం ఆగష్టు, సెప్టెంబర్ వ‌ర‌కూ షూటింగులకి అనుమ‌వ‌తి ఇవ్వబోమ‌ని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఎక్కువ సినిమాలు నిర్మాణం జరిగే మిగతా ఇండ‌స్ర్టీలు కూడా ఇదే విధానంతో ఉండొచ్చు. ఈ పర్మిషన్ అనేది పొడిగించ వ‌చ్చు కూడా. సినిమాలు ఏ ప్రభుత్వానికి అయినా చివ‌రి ప్రయారిటీ. ఒక మీడియం రేంజ్ సినిమా షూటింగ్ అంటేనే కనీసం 50 మంది పైనే ఉంటారు. ఇంకా పెద్ద సినిమాలంటే 200-300 వరకు ఉంటారు. అంతమంది ఒకే చోట ఏక‌మ‌వ్వ‌డం, ప్రతిరోజు ఇంటికెళ్లి మళ్ళీ షూటింగ్ కి రావటం, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో అనే భయం అతి పెద్దది. ఇది కేవలం బాగా జనాలు తిరిగే కృష్ణానగర్ ఇందిరానగర్ లో ఉండే సినిమా వర్కర్స్ నుంచి ఖరీదైన ప్రాంతాల్లో ఉండే హీరోలు దర్శకులు ఇతర టెక్నీషియ‌న్ల వరకు ఎవరికీ మంచిది కాదు.

అసలు సామాజిక దూరం అసాధ్యమైన ప‌ని సినిమా షూటింగులది. ఒక ఫ్యాక్టరీ లోనో ? ఆఫీస్ లోనో ప‌ద్ద‌తిగా గా హైజీన్ పద్ధతులు పాటించవచ్చేమో గాని షూటింగ్ చేసేటప్పుడు దాదాపు అసాధ్యం. రోజు కూలీ మీద ఆధారపడే వర్కర్స్ రెడీ అయినా హీరోలు దర్శకులు లాంటి వాళ్ళు మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయడం ఖాయం. కొంతమంది ఇండస్ట్రీ అనుభవజ్ఞుల అంచనా ప్రకారం షూటింగ్ ప్రారంభించ‌డానికి మ‌రో ఆరునెలలు పట్టొచ్చ‌ని అంటున్నారు. ఈ గ్యాప్లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లు చేసుకోవ‌డానికి వీలుగా ఉంటుందంటున్నారు. ఇంతకుముందులా షూటింగ్ అంటే పర్మిషన్ ఇచ్చే అపార్టుమెంట్ల వాళ్లు, కానీలలో ఇళ్ళు అద్దెకిచ్చే వాళ్ళు ఇక‌పై ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ వాళ్లకి ఇచ్చే ఆలోచన ఉన్నా మిగతా రెసిడెంట్స్ ఒప్పుకోకపోవచ్చు. అపార్ట్మెంట్స్ , కాల‌నీల్లో షూటింగులు మాత్రం చాలా కష్టం కానున్నాయి.

రెగ్యులర్ సినిమా స్టైల్ లో కాకుండా, మినిమల్ కాస్ట్ అండ్ క్రూ ఉంటే సాధ్యమవచ్చేమో. లేదా నిర్మాణంలో ఉన్న వాటిని సెట్స్ గా మార్చుకోవాలి. స్టూడియోస్ లో ఉన్న సెట్లు లొకేషన్స్ సరిపోకపోవచ్చు. ఆల్రెడీ సినిమాలు మొదలుపెట్టిన నిర్మాతలు అవి ఎలా ఫినిష్ చేయాలి, చేసాక వాటిని ఎక్కడ ఎలా అమ్ముకోవాలి అనే అతి పెద్ద సందిగ్ధలో ఉన్నారు. కాబట్టి కొత్తవి మొదలుపెట్టరు. పోనీ కొత్త నిర్మాతలు ముందుకు వస్తారా? రాబోయే ఆర్ధిక సంక్షోభ సమయంలో అత్యంత అనిశ్చిత పరిస్థితిలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇండిపెండెంట్ నిర్మాతలు ఆస‌క్తి చూపించకపోవచ్చు. ఒకవేళ ముందు తీసేసి తర్వాత ఓటీటీ లకి అమ్ముకుందాం అనుకున్నా! అక్కడ నుంచి గ్యారెంటీ కూడా లేదు. ప్రోడక్ట్ ని చూసాక వాళ్ళు నిర్ణయిస్తారు.

అలాంటప్పుడు ఎంతలో తీస్తే సేఫ్ అనేదానికి గ్యారంటీ లేదు. కొన్ని రెగ్యులర్ ప్రొడక్షన్ కంపెనీలు దీనిమీదే ఆధారపడ్డవాళ్లు ఉన్నారు. వాళ్లకి కథ నచ్చితే దాన్ని ఏదైనా ఓటీటీ ప్లాట్ పైంకి కి తెచ్చి బ‌డ్జెట్ చెక్ చేసుకుని వెబ్ సీరీసో? వెబ్ ఫిల్మో? మొదలుపెడతారు. దీంట్లో వీళ్ళకి చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. కాబట్టి ప్రొడక్షన్ కి కూడా చాలా త‌క్కువ బ‌డ్జెట్ మాత్రమే ఇస్తారు. ఇంతకు ముందంత ప్యాన్సీ గా మాత్రం ఫిలిం ప్రొడక్షన్ ఉండ‌దు. అన్ని శాఖ‌ల్లోనూ క్రూ ని తగ్గించాల్సిందే. తక్కువ బ‌డ్జెట్ లో మంచి క్వాలీటీ ఇవ్వాల‌ని ఒత్తిడి ఫిల్మ్ మేక‌ర్ పైనా, అతని టీం మీద విపరీతంగా పెరుగుతుంది.