వరుణ్ సందేష్ హీరోగా నటించిన `కొత్త బంగారులోకం` చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది శ్వేతాబసు ప్రసాద్. తొలి చిత్రంతోనే మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే ఆ క్రేజ్‌కి తగ్గట్టుగా మాత్రం అవకాశాల్ని మాత్రం పొందలేకపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గడం, ఓ కేసులో ఇరుక్కోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ఎంత ప్రయత్నించినా అక్కడ కూడా అవకాశాలు దక్కపోవడంతో బుల్లితెరని నమ్ముకుంది.
అక్కడ బిజీ అవుతున్న వేళ రోహిత్ మిట్టల్‌తో శ్వేతబసుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2018 డిసెంబర్‌లో వీరి వివాహం జరిగింది. ఏడాది తిరక్కుండానే వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2019 డిసెంబర్‌లో విడాకుల కోసం అప్లై చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త రోహిత్ మిట్టల్‌తో విడిపోయి నెల రోజులు కూడా కాకుండానే శ్వేతా బసు గోవా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
గోవా బీచ్‌లో బికినీ ధరించి హంగామా చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియా ఇన్‌స్టాలో అభిమానుల కోసం షేర్ చేసింది. ఇప్పడీ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. శ్వేత గత కొంత కొంత కాలంగా టీవీ సీరియల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది.